Ads
బ్యాటింగ్ లో రోహిత్,కోహ్లీ లాంటి నంబర్ 1 ప్లేయర్ ఉన్న స్పిన్ లో జడేజా, కుల్దీప్ యాదవ్, చాహాల్ వంటి మెజీషియన్స్ ఉన్న వికెట్ల వెనుక ధోని లాంటి తిరుగులేని కీపర్ ఉన్న పేస్ లో బుమ్రా షమీ భువేశ్వర్ వంటి ఆన్ ఫీల్డ్ బ్రిలియంట్స్ ఉన్న భారత్ వరల్డ్ కప్ గెలవలేక సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.
Video Advertisement
దీనికి ప్రధాన కారణం నమ్మకమైన ఆల్ రౌండర్ లు లేకపోవడమనే చెప్పాలి.అలాగని మనకు ఆల్ రౌండర్స్ లేరని కాదు ఉన్నారు హార్దిక్ పాండ్యా,జడేజా వంటి వారున్నారు.కాని వాళ్ళు ఫుల్ లెన్త్ ఓవర్స్ వేయలేరు ఒకవేళ వేసినా భారీగా పరుగులు ఇస్తున్నారు.అందుకే వారి ఓవర్స్ ను ముందే వేయించేస్తున్నారు.అయినప్పటికీ వాళ్ళు పరుగులు భారీగా ఇచ్చేస్తున్నారు.దీనితో తప్పకుండా ఐదుగురు ఫుల్ లెన్త్ బౌలర్స్ ను టీంలోకి తీసుకోవాల్సి వస్తుంది.లేదా ఇద్దరు ఆల్ రౌండర్స్ ను టీం లోకి తీసుకోవాల్సి వస్తుంది.దీనివల్ల టీం బ్యాలన్స్ తప్పి ఓటమి చూడాల్సి వస్తుంది.
ఈ విషయం పై బోలెడు సార్లు చర్చలు కూడా జరిగియి కాని ఫలితం దక్కలేదు.ఇదే అటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కు స్ట్రాంగ్ పాయింట్స్ అందువల్లే ఆ రెండు టీమ్స్ ఫైనల్స్ లో డి అంటే డి రేంజ్ లో తలపడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది.అందులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ , బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో భారీ విజయాన్ని ఇంగ్లాండ్ సొంత చేసుకుంది.
బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటూ ఇండియా ఆల్ రౌండర్ ఇఫ్రాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.అందుకు యువి క్రేజీ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరు భారత సీనియర్ ఆల్ రౌండర్స్ ఒకరి పై ఒకరు వేసుకున్న కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటి పై ఓ లుక్ వేయండి.
End of Article