Ads
చాలా వరకు సినిమాల్లో కనిపించేవాళ్ళు నిజజీవితంలో తాము పోషించే పాత్రలు ఎంతో భిన్నంగా ఉంటారు. అందుకే వాళ్లని నటులు అంటారు. వాళ్లు చేసేదాన్ని నటన అంటారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్, సోనుసూద్ ఉదాహరణగా తీసుకుందాం. వీళ్లిద్దరు చాలా సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు చేశారు. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి. కానీ నిజ జీవితంలో వీళ్ళిద్దరూ సమాజానికి ఎంతో మంచి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కి కూడా తను పోషించిన పాత్రకు నిజ జీవితానికి అసలు సంబంధమే లేదు.
Video Advertisement
పైన ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టే ఉంటారు. డియర్ కామ్రేడ్ సినిమా లో విలన్ పాత్ర పోషించారు. ఆయన పేరు రాజ్ అర్జున్. డియర్ కామ్రేడ్ సినిమా చూసిన ప్రతి వ్యక్తికి ఇతని మీద కోపం వచ్చే ఉంటుంది. ఆయన పోషించిన పాత్ర అలాంటిది మరి. రాజ్ అర్జున్ హిందీలో లో తమిళ్ లో ఎన్నో సినిమాలు చేశారు. హిందీలో ఎంతో విజయవంతమైన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో కూడా దాదాపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఆ పాత్ర లో ఆయన చేసిన నటన తో హిందీ ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యారు.
డియర్ కామ్రేడ్ సినిమా లో లిల్లీ క్రికెట్ నుండి దూరం అవడానికి కారణం అయ్యే పాత్ర దిరాజ్ అర్జున్ పోషించారు. సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా లో కుటుంబాన్ని మొత్తం అదుపులో పెట్టుకొని, కూతురు సింగర్ అవ్వకుండా అడ్డుపడి స్కూలు చదువు అయిపోగానే వేరే దేశానికి తీసుకెళ్ళి పెళ్లి చేయాలి అని అనుకున్న తండ్రి పాత్రలో నటించారు.
ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ వేరే ఉన్నా చివరికి మెంటాలిటీ ఒకటే. హీరోయిన్ కలలకు అడ్డుపడడం. ముఖ్యంగా సీక్రెట్ సూపర్ స్టార్ అయితే తన కన్న కూతురి కలలు పట్టించుకోకుండా బెదిరించి తనకు నచ్చిన విధంగా చేయాలి అనుకునే తండ్రి పాత్ర అతనిది. కానీ నిజ జీవితంలో ఇందుకు భిన్నంగా తన కూతురు ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు రాజ్ అర్జున్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కూతురు కూడా నటనారంగంలో నే ఉంది. తను మన అందరికీ తెలుసు కూడా.
తనే సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కూతురు పాత్రను పోషించింది. తర్వాత దాగుడుమూత దండాకోర్ సినిమాలో కూడా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేస్తోంది సారా.
మీరు కూడా షాక్ అయ్యారు కదా? ఒక వ్యక్తి సినిమాల్లో పోషించే పాత్రలకి నిజ జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది అన్న విషయం మీకు కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది.
End of Article