తప్పుగా అనుకోకండి..అసలు కథ ఏంటో చూడండి.! కనిపెట్టగలరేమో ట్రై చేయండి.!

తప్పుగా అనుకోకండి..అసలు కథ ఏంటో చూడండి.! కనిపెట్టగలరేమో ట్రై చేయండి.!

by Mohana Priya

Ads

పెయింటింగ్ అనేది ఒక మంచి రిక్రియేషన్. కొంతమంది మనుషుల ముఖాలను పెయింట్ చేస్తారు, ఇంకొంతమంది నేచర్ ని పెయింట్ చేస్తారు, ఇంకొంతమంది కట్టడాలని. ఇలా పెయింటింగ్ లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని పెయింటింగ్స్ అయితే నిజంగా ఉన్న దాన్ని ఫోటో తీసినట్టు ఉంటాయి. అంత బాగా వేస్తారు. రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ రంగులతో ఒక కాన్వాస్ నింపడం కూడా పెయింటింగే. అలాంటి పెయింటింగ్స్ ఆర్ట్స్ కిందకి వస్తాయి.

Video Advertisement

మనకి అర్థం అవ్వదు కానీ, అలా ఒక కాన్వాస్ పై కొన్ని రంగులని కలిపి వేసిన ఆర్ట్స్ వెనకాల కూడా ఏదో ఒక అర్థం ఉంటుందట. సాధారణంగా పెయింటింగ్ అంటే పేపర్ మీద, కాన్వాస్ మీద, లేదా గోడల మీద వేస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం మనిషి శరీరం పై పెయింటింగ్ వేస్తారట. విషయమేంటంటే.

జార్గ్ డస్టర్‌వాల్డ్ జర్మనీకి చెందిన ఒక చిత్రకారుడు. కానీ జార్గ్ డస్టర్‌వాల్డ్ కొంచెం భిన్నంగా శరీరంపై పెయింట్ వేస్తారట. పైనున్న పెయింటింగ్ లో ఒక మనిషి దాగి ఉన్నారు. కొంచెం పరిశీలించి చూస్తే మీకు కూడా కనిపిస్తారు. ఇది ఒకటే కాదు ఇలా ఒక ప్రదేశం, లేదా వేరే ఏదైనా పెయింటింగ్ వేసినా కూడా అందులో మనిషి కూడా ఖచ్చితంగా ఉండేలా బొమ్మను వేస్తారట జార్గ్ డస్టర్‌వాల్డ్. ఎంతో సేపు చూస్తే తప్ప అందులో మనిషి ఉన్నారు అని కనిపెట్టడం కొంచెం కష్టమే. జార్గ్ డస్టర్‌వాల్డ్ వేసిన మరికొన్ని పెయింటింగ్స్ ఇవే.

https://www.instagram.com/p/Bi4-0-vDDq9/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CDtvU4dJnEY/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B2wKV6VooR0/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CBC6zCqpeou/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BwuyfYYpygD/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CB3RKftpIUH/?utm_source=ig_web_copy_link

పైన కనిపించేవన్నీ జార్గ్ డస్టర్‌వాల్డ్ ఆర్ట్స్. అవన్నీ ఒక ఎత్తయితే, అందులో ఒక మనిషి ఉన్నా కూడా మనకి కనిపించకుండా పెయింటింగ్ వేయడం మరొక ఎత్తు. కళ ఎంతోమంది ఆర్టిస్టులు ప్రదర్శిస్తారు. కానీ కళని ఇంత అరుదైన మార్గంలో ప్రదర్శించే వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందులో జార్గ్ డస్టర్‌వాల్డ్ ఒకరు. తాను అనుకున్నది భయపడకుండా, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించకుండా ప్రజెంట్ చేసిన జార్గ్ డస్టర్‌వాల్డ్ ప్రతిభ నిజంగానే అభినందించాల్సిన విషయం.

 


End of Article

You may also like