RR కూడా “అస్సాం ట్రైన్“ ఎక్కింది అంటూ…RR vs KKR మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

RR కూడా “అస్సాం ట్రైన్“ ఎక్కింది అంటూ…RR vs KKR మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 60 పరుగుల తేడా తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన స్టీవ్‌ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో శుభమన్ గిల్ (36: 24 బంతుల్లో 6×4) తో కలిసి ఓపెనర్ నితీశ్ రాణా (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (39: 34 బంతుల్లో 4×2, 2×6) స్కోర్ చేశారు.

Video Advertisement

తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (0) చేయగా, ఆండ్రీ రసెల్ (25: 11 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి ఇయాన్ మోర్గాన్ (68 నాటౌట్: 35 బంతుల్లో 5×4, 6×6) ఇన్నింగ్స్ కొనసాగించారు. వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన ఆండ్రీ రసెల్ మూడవ సిక్స్ కోసం ప్రయత్నిస్తూ అవుట్ అయ్యారు. ఇయాన్ మోర్గాన్ చివరి వరకు క్రీజులో నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు, కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు, జోప్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 191 పరుగుల స్కోర్ చేసింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్లు బెన్ ‌స్టోక్స్ (18: 11 బంతుల్లో 2×4, 1×6), రాబిన్ ఉతప్ప (6: 2 బంతుల్లో 1×6) స్కోర్ చేశారు. తర్వాత స్టీవ్‌ స్మిత్ (4), సంజు శాంసన్ (1), రియాన్ పరాగ్ (0) చేయగా, జోస్ బట్లర్ (35: 22 బంతుల్లో 4×4, 1×6), రాహుల్ తెవాటియా (31: 27 బంతుల్లో 2×4, 1×6) చేశారు. చివరిలో శ్రేయాస్ గోపాల్ (23: 23 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లలో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు, శివమ్ మావి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు, నాగర్ ‌కోటి ఒక వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 131/9 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24 #25 #26 #27 #28


End of Article

You may also like