ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు…ఆ స్థాయిని వదిలి ఓ సైకిల్ పై.?

ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు…ఆ స్థాయిని వదిలి ఓ సైకిల్ పై.?

by Mohana Priya

Ads

ఏదైనా జడ్జ్ చేయాలంటే జడ్జ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒక మనిషిని జడ్జ్ చేయడంలో అయితే అందరికీ చాలా అనుభవం ఉంటుంది. ఒక మనిషి సైలెంట్ గా ఉంటే చాలా మంచి వ్యక్తి, తన పని తాను చేసుకుంటున్నాడు అనుకుంటాం. అదే ఒక మనిషి వచ్చి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అన్ని విషయాలు వాళ్లకే కావాలి అనుకుంటాం.

Video Advertisement

అవతల వ్యక్తి నీట్ గా డ్రస్ చేసుకుని ఉంటే చదువుకున్న వాడు అని, ఇస్త్రీ లేని చిరిగిన బట్టలు వేసుకుంటే చదువు లేని వాడు అని అంచనా వేసేస్తాం. అలా ఒక వ్యక్తిని చూడగానే ఒక అంచనాకు రావడం అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు అలోక్ సాగర్ కథ వింటే ఈ విషయం మళ్ళీ ఇంకొకసారి అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి.

ఒక వ్యక్తి షర్ట్ లేకుండా, మాసిపోయిన గడ్డంతో గిరిజన గ్రామంలో సంచరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో భద్రతా ఏర్పాట్లు చూడడానికి ఐపీఎస్ ఆఫీసర్ బేతుల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుండగా, ఆ వ్యక్తి పట్టించుకోకుండా సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు. అతని గురించి గ్రామస్తులను అడగగా ఆయన పేరు అలోక్ సాగర్ అని, ఆయన వాళ్ళ ఊరిలోనే ఉంటారు అని చెప్పారు. అంతకుమించి ఎక్కువ తెలియదు అని అన్నారు.

పోలీసులు అలోక్ సాగర్ ని కలిసి వివరాలు అడిగారు. పేరు అడిగితే అలోక్ సాగర్ అని చెప్పారు. ఐడెంటిటీ ప్రూఫ్ అడిగితే తెచ్చుకోలేదు అని, తాను భారతీయుడినే అని, సాధారణ జీవితం జీవిస్తున్నాను అని చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు లోకి తీసుకున్నారు.

పోలీసులు అలోక్ సాగర్ ని వివరాలు చెప్పమని అడిగితే, ఏ భాషలో కావాలి అని, తనకి ఎనిమిది భాషలు తెలుసు అని, తాను ఒక ప్రొఫెసర్, అమెరికాలో పి హెచ్ డి చేశాను అని, మాజీ ఆర్బిఐ గవర్నర్ అయిన రఘురాం రాజన్ తన శిష్యుడు అని, కావాలి అంటే ఫోన్ చేసి కనుక్కోమని ఇంగ్లీష్ లో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అలోక్ సాగర్.

తర్వాత వివరాలు తెలుసుకొని నిజంగానే అలోక్ సాగర్ ప్రొఫెసర్ అని తెలిసిన పోలీసులు వెళ్లి అలోక్ సాగర్ కి క్షమాపణలు తెలిపారు. అలోక్ సాగర్ 32 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ లోని మారుమూల గిరిజన గ్రామాలలో నివసిస్తున్నారు అలాగే అక్కడ నివసిస్తున్న ప్రజలకు సేవ చేస్తున్నారు. అలోక్ సాగర్ చదువు చెప్పిన వాళ్లలో ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు.

గత 26 సంవత్సరాలుగా 750 మంది గిరిజనులు ఉన్న, రోడ్లు సరిగా లేని, కేవలం ఒక్క ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉన్న కొచాము అనే మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు. అలోక్ సాగర్ ఇప్పటివరకు 50 వేల చెట్లను నాటారు. “భారత దేశంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. కానీ చాలా మంది వాళ్ల తెలివిని జనాలకి సేవ చేయడంలో కాకుండా, కేవలం డిగ్రీలు చూపించడానికే పరిమితం చేస్తున్నారు” అని అంటారు అలోక్ సాగర్.

అలోక్ సాగర్ దగ్గర ఒక సైకిల్ ఇంకా 3 కుర్తాలు ఉన్నాయి. గిరిజనుల్లో విత్తనాలను పంపిణీ చేస్తూ, అలాగే తాను కూడా సేకరిస్తూ తన రోజుని గడుపుతారు. అలోక్ సాగర్ ఈ ప్రాంతంలోని గిరిజనులు ఉపయోగించే అనేక భాషలు మరియు మాండలికాలను (యాస) మాట్లాడగలరు. శ్రామిక్ ఆదివాసి సంగథన్‌తో దగ్గరి సంబంధం ఉన్న అలోక్ సాగర్, వారి అభ్యున్నతి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.


End of Article

You may also like