ఒకరితో బాటింగ్…ఇంకొకరితో బౌలింగ్ చేయించి మ్యాచ్ లాగేసుకున్నారుగా అంటూ ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

ఒకరితో బాటింగ్…ఇంకొకరితో బౌలింగ్ చేయించి మ్యాచ్ లాగేసుకున్నారుగా అంటూ ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 150/7 కిి పరిమితం అయ్యింది ఆస్ట్రేలియా. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) స్కోర్ చేయగా, రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) స్కోర్ చేశారు. మొదటిలోనే శిఖర్‌ ధావన్‌ (1) అవుట్ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (9) తో కలిసి రాహుల్‌ వేగంగా పరుగులు చేశారు. పవర్‌ ప్లేలో భారత్‌ ఒక వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది.

Video Advertisement

తర్వాత టీం ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సంజూ శాంసన్‌ (23), మనీష్‌ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో 92 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్‌ కి వచ్చిన హార్దిక్‌ పాండ్య (16; 15 బంతుల్లో, 1×6), జడేజా ఆదుకునే ప్రయత్నం చేసినా ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వగా, జడేజా మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో చివరి 3 ఓవర్లలో టీం ఇండియా‌ 46 పరుగులు సాధించింది. వాషింగ్టన్‌ సుందర్‌ 7 పరుగుల స్కోర్ చేశారు. ఆసీస్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ మూడు వికెట్లు, స్టార్క్‌ రెండు వికెట్లు, స్పెప్సన్ ఒక వికెట్‌, జంపా ఒక వికెట్ పడగొట్టారు.

టీం ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆర్కీ షార్ట్‌ (34; 38 బంతుల్లో 3×4), ఆరోన్‌ ఫించ్‌ (35; 26 బంతుల్లో 5×4, 1×6) స్కోర్ చేశారు. ఫించ్‌ ను, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌స్మిత్ ‌(12)ను కొంత వ్యవధి లోనే పెవిలియన్ కి పంపారు చాహల్. 8వ ఓవర్ ‌లో ఫించ్, 10వ ఓవర్‌ లో స్మిత్ అవుట్ అయ్యారు. తర్వాత ఓవర్లో మాక్స్‌వెల్‌ (2) నటరాజన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగారు. ఈ క్రమంలో షార్ట్‌, హెన్రిక్స్‌ (30; 20 బంతుల్లో 1×4, 1×6) మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 15వ ఓవర్‌ లో షార్ట్‌ ను అవుట్ చేశారు నటరాజన్. తర్వాత మాథ్యూవేడ్‌ (7), హెన్రిక్స్‌, మిచెల్‌ స్టార్క్‌(1) వరుసగా అవుట్ అవ్వగా, అబాట్‌ (12), స్వెప్సన్‌ (12) ధాటిగా ఆడటంతో ఓటమి అంతరం కొంచెం తగ్గింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20


End of Article

You may also like