మ్యాచ్ పోయినా సిరీస్ దక్కింది…IND vs AUS 3rd T20 పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

మ్యాచ్ పోయినా సిరీస్ దక్కింది…IND vs AUS 3rd T20 పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాకి, ఇండియాకి మధ్య జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. మాథ్యూ వేడ్‌ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్‌వెల్‌ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) స్కోర్ చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, నటరాజన్ ఒక వికెట్, శార్ధూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

టీం ఇండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) తొలి వికెట్ లోనే డక్ ఔట్ అయ్యారు. తర్వాత శిఖర్ ధావన్ (28: 21 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన సంజు శాంసన్ (10), శ్రేయాస్ అయ్యర్ (0) కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. దాంతో టీమ్ ఇండియా ఒత్తిడికి గురయ్యింది. ఒక ఎండ్ లో వరుసగా వికెట్స్ పడుతున్నా కూడా విరాట్ కోహ్లీ (85: 61 బంతుల్లో 4×4, 3×6) పట్టువిడవకుండా బ్యాటింగ్ కొనసాగించారు. అర్థ శతకం తర్వాత టాప్ గేర్ లోకి వెళ్లిన కోహ్లీ ఆశ్చర్యపడే విధంగా సిక్సర్లు కొట్టారు.

ఇంకొక ఎండ్ లో హార్దిక్ పాండ్యా (20: 13 బంతుల్లో 1×4, 2×6) కూడా వేగం అందుకోవడంతో టీం ఇండియాలో ఉత్సాహం కనిపించింది. కానీ టీం ఇండియా స్కోర్ 144 వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. దాంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో ప్రతి బాల్ ని హిట్టింగ్‌ కి ప్రయత్నించిన కోహ్లీ 19వ ఓవర్‌ లో అవుట్ అయ్యారు. చివరిలో శార్ధూల్ ఠాకూర్ (17 నాటౌట్: 7 బంతుల్లో 2×6) స్కోర్ చేయడంతో టీం ఇండియా ఓటమి అంతరం తగ్గింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18


End of Article

You may also like