“సాయి ధరమ్ తేజ్” చేసిన ఈ మంచి పని తెలుస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.! రియల్ హీరో!!!

“సాయి ధరమ్ తేజ్” చేసిన ఈ మంచి పని తెలుస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు.! రియల్ హీరో!!!

by Mohana Priya

Ads

చాలా మంది సెలబ్రిటీలు సమాజానికి కూడా వారి వంతు సహాయం అందిస్తూ ఉంటారు. వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్ తేజ్ ఇటీవల విజయవాడలోని అమ్మ ప్రేమ ఆదరణ అనే ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. కొంత కాలం క్రితం సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు నాడు, తన సోషల్ మీడియా అకౌంట్ కి ఒకరు ఈ ఆశ్రమం శిధిలావస్థలో ఉన్న ఫొటోలను పంపించి, సహాయం చేయమని సాయి ధరమ్ తేజ్ ని కోరారు.

Video Advertisement

ఇందుకు సాయి ధరమ్ తేజ్ స్పందించి 6 లక్షల రూపాయలను ఆ ఆశ్రమం వారికి అందజేశారు. అలాగే ఒక సంవత్సరం మొత్తం వారికి భోజనాలకి, ఇతర అవసరాలకి అయ్యే ఖర్చు కూడా సాయి ధరమ్ తేజ్ చూసుకుంటాను అని ప్రమాణం చేశారు. ఇటీవల ఆశ్రమం బాగుచేయడం పూర్తయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ వెళ్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న వారితో మాట్లాడారు.

సాయి ధరమ్ తేజ్ చేసిన మంచి పనికి నెటిజన్ల నుండి మాత్రమే కాకుండా, ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా విడుదలైన ఈ సినిమా పాటలు అన్నీ విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలయ్యే మొదటి తెలుగు సినిమా ఇదే. అలాగే సాయి ధరమ్ తేజ్, దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.


End of Article

You may also like