ఇదేందయ్యా ఇది!! కొబ్బరిబోండం కొన్నప్పుడు ఒక సీట్ లో ఉండి…నెక్స్ట్ సీన్ లో ఇంకో సీట్ లోకి ఎలా.?

ఇదేందయ్యా ఇది!! కొబ్బరిబోండం కొన్నప్పుడు ఒక సీట్ లో ఉండి…నెక్స్ట్ సీన్ లో ఇంకో సీట్ లోకి ఎలా.?

by Anudeep

Ads

కమెడియన్ గా సునీల్ కు ఎవర్ గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కామెడీ పండించడం లో సునీల్ ను ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాంటి సునీల్ ప్రేక్షకులను అలరించడం కోసం హీరో గా కూడా ప్రయత్నాలు చేసాడు. అలా సునీల్ కమెడియన్ గా ఓ వెలుగు వెలుగుతూ, హీరో గా ప్రయత్నాల్లో ఉన్న సమయం లో వచ్చిన సినిమా నే “మర్యాద రామన్న”. సునీల్, సలోని జంట గా వచ్చిన సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్నిసార్లు చుసిన ఈ సినిమా అస్సలు బోర్ కొట్టదు. సునీల్ డైలాగు డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ కట్టిపడేస్తాయి.

Video Advertisement

ఇప్పటికే, ఈ సినిమా ఏ ఆదివారం రోజో టివి లో వస్తే.. సరదా గా కూర్చుని చూసేస్తాం. కొంతమంది అయితే.. ఈ సినిమా ను ఇప్పటికి ఎన్నిసార్లు చూసి ఉంటారో ఓ లెక్క పత్తా కూడా ఉండి ఉండదు. కానీ, ఎన్నిసార్లు ఈ సినిమా చూసినా ఒక మిస్టేక్ మాత్రం మీరు గమనించి ఉండరు. అదేంటో ఇపుడు చూద్దాం.. “మర్యాద రామన్న” సినిమా లో ట్రైన్ సీన్ బాగా హై లైట్ అయిన సంగతి తెలిసిందే. హీరో సునీల్, సలోని ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. సలోని ముందు సునీల్ కొంచం బిల్డ్ అప్ ఇస్తూ మాట్లాడుతూ, ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమం లోనే పక్కన కొబ్బరి బొండం లు అమ్ముకుంటున్న వ్యక్తి దగ్గర ఒక బొండం కొనుగోలు చేస్తాడు.

అయితే, చెయ్యిని కిటికీ బయటకు పెట్టి కొంటాడు. స్ట్రా కూడా వద్దు అంటూ సలోని దగ్గర హైప్ క్రియేట్ చేసుకుంటాడు. ఆ తరువాత ట్రైన్ కదులుతుంది. బొండం లోపలికి లాగుదామంటే ఎంత ట్రై చేసినా రాదు.. ఇక్కడ చాలా సరదాగా అనిపిస్తుంది. చివరికి ఓడిపోయినట్లు ఫీల్ అయ్యి బోండాన్ని విసిరేస్తాడు. అది స్థంభానికి కొట్టుకుని వెనకాల ట్రైన్ బోగి లోపల ఎంట్రీ నుంచి సునీల్ చేతిలోకి వచ్చినట్లు చూపించారు.

అక్కడ ఆ క్షణినికి ఆ లాజిక్ కరెక్ట్ కదా అని మనం అనుకుంటాం. కానీ మొదట చూపించినపుడు సునీల్ కూర్చున్న బెర్త్ బోగి ఎంట్రీ నుంచి మూడు సీట్ల దూరం లో ఉంటుంది. కానీ రెండవసారి, బొండం లోపలి వచ్చినపుడు సునీల్ బెర్త్ ను బోగి ఎంట్రన్స్ కి పక్కనే ఉన్నట్లు చూపించారు. ఇది చిన్న మిస్టేక్ అయినా, సినిమా చేసేటపుడు ఎవరు గమనించి ఉండరు. సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని పొరపాటున జరుగుతుంటాయి. ఆక్షణం అవి మనకు తెలీకపోయినా తరువాత తెలిసినపుడు ఫన్నీ గా అనిపిస్తాయి.

watch video:


End of Article

You may also like