“రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా లో ఈ నటి ఒకప్పటి హీరోయిన్..ఆమె స్టోరీ మీకు తెలుసా?

“రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా లో ఈ నటి ఒకప్పటి హీరోయిన్..ఆమె స్టోరీ మీకు తెలుసా?

by Anudeep

Ads

హీరో నాగ చైతన్య “రారండోయ్ వేడుక చేద్దాం” సినిమా మీరు చూసే వుంటారు. ఆ సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి కౌసల్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా.? “నువ్వే నా ప్రేయసి” అనే సినిమా ద్వారా ఈ నటి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పటికీ, “ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం” అనే పాట ఉంటె అలనాటి కౌసల్యను గుర్తు చేసుకోకుండా ఉండలేము.

Video Advertisement

actress kousalya feature image

జగపతి బాబు హీరో గా “అల్లుడు గారు వచ్చారు” అనే సినిమా తో కౌసల్య టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ హీరో గా నటించిన “పంచదార చిలుక” సినిమా తో కౌసల్య సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. పంచదార చిలక కౌసల్యకు మంచి గుర్తింపు నే తెచ్చిపెట్టింది. ఆ సినిమా హిట్ తో వరుస గా తమిళ, తెలుగు సినిమాల్లో కౌసల్యకు అవకాశాలు వచ్చాయి. వాస్తవానికి కౌసల్య కన్నడ నటి. ఆమె కన్నడ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. అందం, అభినయం తో పాటు తన నటనా ప్రతిభతో కౌసల్య ఆకట్టుకుంటూ వచ్చారు.

actress kousalya photo 3

తాజాగా, ఆమె నలభయ్యవ ఒడికి చేరుకున్నారు. ఈ క్రమం లో ఆమె పెళ్ళికి సంబంధించి పలు రూమర్లు వస్తున్నాయి. గతం లో ఆమె ఓ స్టార్ హీరో ను ప్రేమించిందని, కానీ అతను మరో వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనితో, కౌసల్య తీవ్ర మనస్తాపానికి గురి అయి సినిమాలకు దూరం గా ఉంది. ప్రస్తుతం, ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం”, “సవ్యసాచి” వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది.

కౌసల్య మొత్తం నాలుగు భాషల్లో ముప్పై సినిమాలు చేసింది. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇటీవలే, సెకండ్ ఇన్నింగ్స్ లో ను తన ప్రతిభను నిరూపించుకోవడానికి కౌసల్య కృషి చేస్తోంది. ఆమె ఒకప్పటి ఫోటోలను మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు.  actress kousalya photos actress kousalya image

actress kousalya photo 2


End of Article

You may also like