Ads
ఒక్కోసారి కొన్ని విషయాలు చాలా కాకతాళీయం గా జరుగుతుంటాయి. కొందరు వాటిని సెంటిమెంట్ లు గా తీసుకుంటారు. కాజల్ ప్రతి సినిమా లో వైట్ డ్రెస్ లో కనిపించడం, రాజమౌళి సినిమా లో నటించాక, ఆ హీరో నెక్స్ట్ సినిమా హిట్ కాకపోవడం.. ఇలాంటివన్నీ చాలా యాదృచ్ఛికం. కానీ పదే పదే జరుగుతుండడం వలన సెంటిమెంట్ లు గా ఫిక్స్ అయిపోతాం. ఒకప్పట్లో కూడా హీరోయిన్లకు అలాంటి సెంటిమెంట్ ఒకటి ఉండేది. అదేంటంటే చంద్రమోహన్ తో కలిసి నటించడం.
Video Advertisement
నటుడు చంద్రమోహన్ ప్రస్తుతం తండ్రి పాత్రల్లోనూ, కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నా ఒకప్పుడు చంద్రమోహన్ హీరో గానే నటించేవారు. ఆ కాలం లో ఆయనతో ఏ హీరోయిన్ నటించినా ఆ తరువాత ఆమెను వరుస అవకాశాలు వరించి స్టార్ లు అయిపోయే వారు. కే. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన సిరిసిరి మువ్వ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చంద్రమోహన్, జయప్రద జంట గా నటించారు. ఈ సినిమా తరువాత జయప్రద ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ తో యమగోల, అడవిరాముడు సినిమాలు చేసే ఛాన్స్ ని కొట్టేసింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అలాగే, 1978 లో శ్రీదేవి , చంద్రమోహన్ అనురాగాలు అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. వీరి కాంబోలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వేటగాడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం. జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి సినిమాలలో ఆఫర్లు శ్రీదేవిని వరించాయి. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అలాగే, అదే సంవత్సరం ప్రాణం ఖరీదు సినిమా లో చంద్రమోహన్, జయసుధ జంట గా నటించారు. ఆ తరువాత వీరిద్దరి కాంబో లో చాలా సినిమాలే వచ్చాయి. వింత కోడళ్ళు, శ్రీమతి ఒక బహుమతి, సాక్షి, కలియుగ స్త్రీ, ఆక్రందన, నిండు నూరేళ్లు వంటి సినిమాలు వచ్చాయి. అప్పటినుంచి, ఇప్పటికి జయసుధ కు తిరుగులేదు.
1983 లో విజయశాంతి, చంద్రమోహన్ కాంబో లో పెళ్లి చూపులు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా చాలా పాపులర్ అయింది. ఆ తరువాత వీరిద్దరి కాంబోలోనే ప్రతిఘటన సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత విజయశాంతి ఎంత పెద్ద స్టార్ అయిందో మనందరికీ తెలుసు.
End of Article