Ads
సాధారణం గా మనం చూసే సినిమాల్లో ఎక్కువ భాగం హీరో చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ తో సహా మిగిలిన పాత్రలన్నీ వస్తూ, పోతూ ఉంటాయి. అలా, కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ నే ప్రధాన పాత్ర గా ఉంచి కథను నడిపిస్తారు. ఇలాంటి సినిమాలను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గా పిలుస్తాం. ఇవి రెండు కాకుండా.. హీరో, హీరోయిన్లకు, సమాన పాత్రలు ఉండి..హీరోయిన్ ఇతర సహనటులను డామినేట్ చేస్తే..? అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
1. కలర్స్ స్వాతి- అష్టాచెమ్మా
కలర్స్ స్వాతి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన తొలి కమర్షియల్ చిత్రం “అష్టాచెమ్మా”. ఈ సినిమా తరువాత నాని ని, అవసరాల శ్రీనివాస్ ను మనం గుర్తుపెట్టేసుకున్నాం. అలాగే, ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక నటి నే చూస్తూ ఉన్నాం. తానెవరో కాదు “కలర్స్ స్వాతి”. యాంకర్ గా చేస్తున్న స్వాతి ఈ సినిమా తో హీరోయిన్ అయ్యింది. ఈ సినిమా లో తన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంది అంటే..మిగతా నటులను సైతం తాను డామినేట్ చేసేసింది.
2. హెబ్బా పటేల్ – కుమారి 21F
హెబ్బా పటేల్ తొలి సినిమా ఇది.. మొదటి సినిమా లో బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బా అదరగొట్టేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుర్రకారు హృదయాల్లో గంట కొట్టించేసింది. ఈ సినిమాలో ఆమె ను ప్రేమించే ముగ్గురు పాత్రలు, ఆమె ప్రేమించే హీరో పాత్రను సైతం డామినేట్ చేస్తూ నటించింది. ఈ సినిమా ఎండింగ్ కొంత డిస్టర్బింగ్ అనిపించినప్పటికీ.. అసలు అలా అనిపించడానికి కారణం కూడా హెబ్బా నటనే.
3. నందిత – ప్రేమ కథా చిత్రం
ప్రేమ కథా చిత్రం సినిమా లో ఘోస్ట్ గా నందిత ఇరగదీసింది. ఆమె కళ్ళు, ఎక్స్ప్రెషన్స్ ఈరోజుకి కూడా మరచిపోలేము. ఈ సినిమా అంత హైలైట్ అవడానికి ఒక కారణం నందిత నటన. ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఆమె ప్రతిభ కచ్చితం గా బయటకొస్తుంది.
4. తమన్నా -100 % లవ్
తమన్నా ఈరోజు ఎంత బిజీ యాక్ట్రెస్ అన్న సంగతి మనకి తెలిసిందే. కానీ, కెరీర్ ప్రారంభం నుంచే తమన్నా సెలెక్టివ్ గా సినిమాలు చేసింది. తన నటనతో ఆకట్టుకుంది. హ్యాపీడేస్ సినిమా తరువాత ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. 100 % లవ్ సినిమా వచ్చే సమయానికి ఆమె అప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంది. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమా చూసాక మనం తప్పకుండ “దట్ ఈజ్ మహాలక్ష్మి” అంటాం.
5. నిత్యా మీనన్ – గుండెజారి గల్లంతయ్యిందే
అలా మొదలైంది తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయినా నిత్యా మీనన్ “గుండె జారీ గల్లంతయ్యిందే” సినిమా తో నితిన్ సరసన నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా నిత్యా, నితిన్ ల పాత్రలు సమాన ప్రాధాన్యత ను కలిగి ఉంటాయి. నిత్య యాక్టింగ్ డామినేటింగ్ గా ఉంటుంది.
6. లావణ్య త్రిపాఠి – అందాల రాక్షసి
లావణ్య త్రిపాఠి తెలుగు తెరకు అందాల రాక్షసి సినిమా తో పరిచయం అయింది. తొలి సినిమా తోనే అద్భుతమైన నటనను కనబరిచి యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టేసింది. మాములుగా, కథ ను డామినేట్ చేస్తూ ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నే డామినేట్ చేస్తారు. ఈ సినిమాతో లావణ్య అందాల రాక్షసి గా కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకుంది.
7. రకుల్ ప్రీత్ సింగ్ – రారండోయ్ వేడుక చూద్దాం
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య ఇద్దరికీ సమానమైన పాత్రలే ఉన్నాయి. ఈ సినిమాలో రకుల్ అమాయకపు పల్లెటూరి పాత్రలో నటించింది. ఆమె పాత్ర చుట్టూనే ఎక్కువ భాగం కథ తిరుగుతుంది.
8. సమంత – అ ఆ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన సినిమా అ ఆ.. ఈ కథలో ఎక్కువగా ఆధిపత్యం వహించిన ఒక పాత్ర, అనసూయ రామలింగం. ఈ పాత్రలో సమంత జీవించేసింది. తన మునుపు సినిమాల కంటే ఈ సినిమాలో సమంత భిన్నం గా కనిపించింది. ఈ సినిమా విజయం సాధించడానికి సమంత కూడా ఒక కారణం. ఈ సినిమాలో ఇతర నటుల ను సమంత డామినేట్ చేసేసింది.
End of Article