Ads
రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ విడుదలయ్యింది. జనవరి 8వ తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. టీజర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్ ఒక ఎత్తయితే, టీజర్ చూసిన తర్వాత పెరిగిన ఆసక్తి ఇంకొక ఎత్తు అనేలా ఉంది. మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపే కాబట్టి కేజిఎఫ్ 1 లో చూసిన పాత్రలు ఈ సినిమాలో కూడా ఉంటారు.
Video Advertisement
ఎలివేషన్స్ కా బాప్ కెజిఎఫ్ 2 సినిమా పై అభిమానులకు చాలా అంచనాలే ఉన్నాయి. ఏ అంచనాలు లేకుండా విడుదల అయినా కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ ఊహించని రికార్డు లు బద్దలు కొట్టింది. చాలామంది అభిమానులనే సంపాదించుకుంది. ఈ సినిమా లో ఎలివేషన్స్ మాములుగా ఉండవు.. మొదటి పార్ట్ బాగా నచ్చేయడం తో సెకండ్ పార్ట్ పై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి.

kgf1-Kgf2-Meme-Templates
అందుకు తగ్గట్లే టీజర్ ని కూడా కట్ చేశారు. టీజర్ లో ఉన్న హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరో వేడి గా ఉన్న గన్ పై నుంచి సిగరెట్ వెలిగించుకుని సీన్ అయితే టీజర్ కె హైలైట్ గా నిలిచింది. అయితే, ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది.
సాధారణం గా, మందు కొట్టడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాలు ఉన్నప్పుడు ఆ సన్నివేశాలు ప్లే అవుతున్న టైం లో కింద ప్రికాషన్ కాప్షన్ జత చేయాల్సి ఉంటుంది. “మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్” అనే క్యాప్షన్స్ ను జత చేయాలి.
సినిమా అయినా, ట్రైలర్ అయినా, టీజర్ అయినా కూడా ఈ క్యాప్షన్స్ జత చేయాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనితో చిత్రబృందం చేసిన పొరపాటు కి యశ్ కూడా నోటీసులు తీసుకోవాల్సొచ్చింది. అయితే, ఈ విషయం పై హీరో యశ్ ఇప్పటివరకు స్పందించలేదు.
watch video:
End of Article