“పెళ్లి సందడి” వెనకున్న ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా.? 301 రోజుల పాటు 1204 ఆటలు ఆడి రికార్డ్.!

“పెళ్లి సందడి” వెనకున్న ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా.? 301 రోజుల పాటు 1204 ఆటలు ఆడి రికార్డ్.!

by Anudeep

Ads

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి గురించి చెప్పుకోవాలి అంటే..కచ్చితం గా పెళ్లి సందడి గురించి చెప్పుకోవాల్సిందే. ఆయన తీసిన ఫామిలీ మూవీస్ లో “పెళ్లి సందడి” ఎవర్ గ్రీన్. ఇప్పటికీ, ఈ సినిమా లోని జామపండు, సౌందర్య లహరి వంటి పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పెళ్లి సందడి అనే పదం కూడా మన ఇళ్లల్లో వినిపించే మాటే. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్‌ లు హీరో, హీరోయిన్లు గా రూపొందిన సినిమా “పెళ్లి సందడి”. ఈ సినిమా వచ్చి ఇప్పటికి పాతికేళ్ళు అవుతోంది. అయినా, ఈ సినిమా టివి లో వస్తుంటే చూస్తూనే ఉంటాం. బోర్ కొట్టదు.

Video Advertisement

pelli sandadi

ప్రేమిస్తే, త్యాగం చేస్తారు అన్న మాటల్ని ఈ సినిమా కధలో రుజువు చేసి చూపించారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు అక్క చెల్లెల్లు. ఒకరికి తెలియకుండా ఒకరు శ్రీకాంత్ నే ప్రేమిస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఇంకొకరి కోసం తమ ప్రేమను త్యాగం చేయాలనుకుంటారు. చివరికి ఎవరి ప్రేమ నిలుస్తుంది అన్నది తెలియాలంటే “పెళ్లి సందడి” చూడాల్సింది. ఆరోజుల్లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా విభిన్న ప్రేమ కథా చిత్రం గా నిలిచింది. అప్పట్లో రికార్డు లు బ్రేక్ చేసింది. ఈ సినిమాను 85 లక్షల బడ్జెట్ లో నిర్మించారు. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎంత వసూలు చేసిందో తెలుసా..? అక్షరాలా పదిహేను కోట్లు.

pelli sandadi 2

హైదరాబాద్ లో ఒక్క సంధ్య థియేటర్ లోనే రూ.1.20కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ని ‘సరిగమపదనిస రాగం’ అనే పాట తో మొదలు పెట్టారట. ఈ పాట చిత్రీకరణకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ క్లాప్ కొట్టాడట. ఈ పాట ను పెళ్లి చూపుల్లో అమ్మాయి కుటుంబం, అబ్బాయి కుటుంబం కలిసి పాడుకుంటారు. ఈ సినిమా లో హీరోయిన్ గా రవళి ని తీసుకున్నారు కదా.. ఆమె చాలా ఛాలెంజింగ్ గా ఈ రోల్ చేసింది. ఒకవేళ ఈ పాట సరిగ్గా రాకపోతే, ఆమె ను సినిమా నుంచి తప్పించేయాలనుకున్నారట. మొదట్లో, ఆమెను అసలు హీరోయిన్ అనే అనుకోలేదట. షూటింగ్ మొదటి రోజే.. ఆమె కాస్ట్యూమ్స్ కూడా కనిపించలేదట. ఎవరో ఆమె హీరోయిన్ అని తెలియక, ఆమె కు ఇవ్వాల్సిన కాస్ట్యూమ్స్ ను రజిత అనే మరో నటి హీరోయిన్ అనుకుని ఆమె గదిలో పెట్టేశారట. తరువాత మళ్ళీ వాటిని తెప్పించి షూటింగ్ కి రావళిని సిద్ధం చేశారట.

pelli sandadi ravali

ఈ సినిమా కి ప్రత్యేకం గా కొరియోగ్రాఫర్ ఎవరిని పెట్టలేదట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావే స్వయం గా స్టెప్పులు వేయించారట. అందుకుగాను ఆయనకు ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది అవార్డు కూడా లభించడం విశేషం. ఈ సినిమా లో ఒక్క సౌందర్య లహరి పాటనే నలభై రోజులు షూట్ చేశారట. షూటింగ్ జరిగిన చోటల్లా..ఈ పాటను కొంత భాగం షూట్ చేస్తూ వచ్చేవారట. ఇందులో తాళాల గుత్తిని గుర్తు గా చూపిస్తారు కదా.. అసలు ఈ కాన్సెప్ట్ ని “జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమా నుంచి తీసుకున్నారట. ఈ సినిమా లో అమ్మని కమ్మని దెబ్బ అనే పాట ఉంటుంది కదా.. అందులో శ్రీదేవి నడుముకి తాళాల గుత్తి పెట్టుకుని ఉంటుంది.

soundarya lahari

ఈ సినిమాలో అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి అనే పాటని కేవలం ఒక్కరోజులో పూర్తి చేసేసారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూర్తి చేసేసారు. ఈ సినిమా విజయవాడ లో 301 రోజుల పాటు 1204 ఆటలు ఆడి రికార్డు సృష్టించింది. 27 సెంటర్లలో రోజుకు నాలుగు ఆటలు చొప్పున ఈ సినిమా జూబ్లీ ఆడింది. ఇలాంటి ఆల్ టైం రికార్డు లు ఈ సినిమా చాలానే సృష్టించింది. ఈ సినిమా 1996 లో జనవరి 12 న విడుదల అయింది. ఈ నెల 12 తో ఈ సినిమా కి పాతికేళ్ళు నిండాయి.


End of Article

You may also like