Ads
సాధారణం గా మనకు ఏదైనా సినిమా బాగా నచ్చేసినా, లేకపోతె ఏ హీరో యాక్టింగ్ లేదా స్టైల్ బాగా నచ్చేస్తే మనం వాళ్ళని అమితం గా అభిమానిస్తాం. అలానే, ఏ హీరో – డైరెక్టర్ కాంబో లో అయినా సినిమా వచ్చినపుడు కూడా ఆ పెయిర్ ని ఇష్టపడతాం.. అది మన ఫేవరెట్ హీరో లేదా డైరెక్టర్ అయినప్పుడు ఆ కాంబో ని ఇంకా ఇష్టపడతాం..
Video Advertisement
కొన్ని సార్లు, మన ఫేవరెట్ హీరో- మన ఫేవరెట్ డైరెక్టర్ కాంబో లో సినిమా రావాలని గట్టిగా కోరుకుంటాం. ఇదంతా ఎందుకు అంటే.. సినిమా పై మనకి ఉండే ఇంటరెస్ట్ అంతే. అలాగే, కొన్ని హీరో – డైరెక్టర్ కాంబో లో వరుస గా హిట్స్ పడితే.. ఆ పెయిర్ ని హిట్ పెయిర్ గా ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు అలా హ్యాట్రిక్ కొట్టేసిన క్రేజీ హీరో – డైరెక్టర్ కాంబో ల లిస్ట్ ను చూసేద్దాం.
1. ఎస్ ఎస్ రాజమౌళి & ప్రభాస్
ముందు మన డార్లింగ్ తోనే మొదలు పెట్టేద్దాం. డార్లింగ్ ప్రభాస్ కి “ఛత్రపతి” సినిమా తో జక్కన్న ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి బిగినింగ్ & కంక్లూషన్ మూవీస్ ప్రభాస్ ని ఇంటర్నేషనల్ రేంజ్ స్టార్ ని చేసేసాడు. సో ఈ కాంబో ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేసింది.
2. చిరంజీవి & రాఘవేంద్రరావు
మరి ఆరోజుల్లో క్రేజి కాంబో అంటే వీరిదే. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, మెగాస్టార్ చిరంజీవి కాంబో లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఆల్ టైం హిట్. ఇంకా, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమా లు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
3. గోపీచంద్ మలినేని & రవితేజ
వీళ్ళ కాంబో కూడా సూపర్ అండి. డాన్ శీను, బలుపు లాంటి సినిమాలతో గోపీచంద్ మలినేని రవితేజ కు హిట్స్ ఇచ్చాడు. తాజాగా, ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న టైం లో కూడా “క్రాక్” మూవీ తో మళ్ళీ హిట్ కొట్టింది ఈ కాంబో.
4. శ్రీనువైట్ల &రవితేజ
వీరిద్దరి కాంబో లో వచ్చిన ఫస్ట్ సినిమా నీకోసం. ఈ సినిమా యావరేజ్ గా హిట్ అయింది. కానీ ఈ సినిమా ఇద్దరికీ ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యే ఛాన్స్ ని ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన వెంకీ, దుబాయ్ శీను మూవీ లు హిట్ అయ్యాయి.
5. వివి వినాయక్ & జూనియర్ ఎన్టీఆర్
ఓ పక్క మాస్ సినిమా లో కామెడీ పండించగలరు వీరిద్దరూ కలిస్తే. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆది హిట్ అయింది. సాంబ యావరేజ్ అనిపించుకున్నా, అదుర్స్ సినిమా తో సూపర్ హిట్ కొట్టారు.
6. పూరి &రవితేజ
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్ ఎంత హిట్ అయ్యాయో మనకి తెలుసు. వీరి క్రేజి కాంబో మళ్ళీ రిపీట్ అయితే ఫాన్స్ కి ఉండే జోష్ వేరు.
7. రాజమౌళి & జూనియర్ ఎన్టీఆర్
జక్కన్న, ఎన్టీఆర్ కలిసి సినిమా వస్తోంది అంటే ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే. వీరి కాంబో మాములుగా ఉండదు మరి. స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలుసు గా.
8. త్రివిక్రమ్ & బన్నీ
వీరిద్దరూ ఇండస్ట్రీ లో మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వీరి క్రేజీ కాంబో లో మూవీ అంటే ఫాన్స్ ఎక్సపెక్టషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సూపర్ హిట్స్ గా నిలిచాయి.
9. కోదండ రామిరెడ్డి & చిరు
అప్పట్లో వీరి కాంబో కి కూడా క్రేజ్ ఉండేది. వీరిద్దరి సినిమా అంటే గ్యారంటీ ఉండేది. మొత్తమ్మీద 28 సినిమాలు కలిసి పని చేసారు. వాటిల్లో 3 మాత్రం పెద్ద హిట్స్. జేబు దొంగ, దొంగమొగుడు, పసివాడి ప్రాణం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు.
10. బి గోపాల్ & బాలయ్య
బి గోపాల్ & బాలయ్య కాంబో కి స్పెషల్ ఫాన్స్ ఉండేవారు. వీరిద్దరి కాంబో లో సినిమా వచ్చింది అంటే పక్కా హిట్ అనుకునేవారు. రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు.
End of Article