అటు యాంకర్లుగా…ఇటు హీరోయిన్లుగా రానించిన 7 మంది టాలీవుడ్ నటిలు..! లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్ వేయండి.!

అటు యాంకర్లుగా…ఇటు హీరోయిన్లుగా రానించిన 7 మంది టాలీవుడ్ నటిలు..! లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్ వేయండి.!

by Anudeep

Ads

చాలా మందికి సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల కల. సినిమా ఇండస్ట్రీ తాము కూడా యాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు. కొందరైతే తాము హీరో/హీరోయిన్లు గా రాణించాలని ఆశపడుతుంటారు. అయితే, హీరో/ హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. హీరోయిన్ గా ఎదగాలి అంటే పాపులర్ అవ్వాలి. అందుకు అందం మాత్రమే ఉంటె సరిపోదు. ప్రతిభ కూడా ఉండాలి. సరైన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే నేర్పరితనం ఉండాలి. ఇండస్ట్రీ లోకి చిన్న చిన్న అవకాశాల తోటి వచ్చి, హీరోయిన్లు గా ఎదిగిన యాక్టర్ల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.

Video Advertisement

1. రెజినా కసాండ్రా:

రెజినా యాంకర్ గా పనిచేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ముందు వరకు రెజినా ఓ ఛానల్ లో క్విజ్ ప్రోగ్రాం కి యాంకర్ గా పని చేసారు. 2005 వ సంవత్సరం లో పదహారేళ్ళ వయసు ఉండగానే ఓ తమిళ సినిమా ద్వారా రెజీనా వెండితెరకు పరిచయమైంది. అందులో ఆమె ప్రతిభకు మంచి మార్కులు పడడం తో రెజినా మంచి అవకాశాలు కొట్టేసారు. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ కి కూడా పరిచయం అయ్యారు. 2012 లో శివ మనసులో శృతి (SMS) అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు.

2. శ్రీముఖి

శ్రీముఖి కూడా తొలుత యాంకర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టింది. 2009 లో అదుర్స్ ప్రోగ్రామ్ తో యాంకర్ గా పరిచయం అయింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చింది. 2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.

3. నిహారిక కొణిదెల:

మెగా డాటర్ నీహారిక కూడా తనకు అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తన కాళ్లపై తాను నిలబడుతూనే వచ్చారు. ఈటివి లో ఢీ షో యాంకర్ గా పని చేసి, ఆ తరువాత “ముద్దపప్పు ఆవకాయ్” అనే వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఆ తరువాత “ఒక మనసు” అనే సినిమా ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసారు. ఇటీవలే, జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహమైన సంగతి తెలిసిందే.

4. అనసూయ

ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ వివాహం, పిల్లలు, వ్యక్తిగత జీవితం.. ఇవేవి కెరీర్ కు అడ్డం కావని నిరూపించింది. అనసూయ 2003 లోనే నాగ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, 2016 వరకు సినిమాలలో కనిపించలేదు. 2013 లో వచ్చిన జబర్దస్త్, మోడరన్ మహాలక్ష్మి, భలే ఛాన్స్ లే, బిందాస్ వంటి షోలతో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సోగ్గాడే చిన్ని నాయనే సినిమా తో అనసూయ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తుంది. కధనం సినిమా లో మెయిన్ రోల్ లో నటించి మంచి నటి అనిపించుకుంది.

5. రష్మీ

రష్మీ ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. 2007 లో వనితా టీవీ లో యువ అనే ప్రోగ్రామ్ ద్వారా రష్మీ యాంకర్ గా పరిచయం అయింది. అంతకన్నా ముందే ఆమె సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. అయితే, రష్మీ యువ ప్రోగ్రాం తోనే అందరికి పరిచయం అయ్యింది. ఆ తరువాత, తెలుగులోనూ, తమిళ్ లోను పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను, బుల్లి తెర టీవీ షోలలో యాంకర్ గాను చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.

6. శృతి సోధీ

Image result for shruti sodhi in patas

శృతి 2015 లో పటాస్ సినిమా తో తెలుగు నాట హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ, ఆమె అంతకుముందే రెండు హిందీ న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసింది. పలు పంజాబీ సినిమాల్లో కూడా శృతి నటించింది.

7. కలర్స్ స్వాతి

కలర్స్ ప్రోగ్రాం లో యాంకర్ గా పని చేసిన స్వాతి ఆ ఛానెల్ పేరు నే తన పేరు పక్కన చేర్చేసుకుంది. అందరికి కలర్స్ స్వాతి గా గుర్తుండిపోయింది. ఆ ప్రోగ్రాం తరువాత స్వాతి కి చాలానే అవకాశాలు వచ్చాయి. 2005 లోనే డేంజర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఓ వైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణించింది.

 


End of Article

You may also like