Ads
రైతులు, సైనికులు దేశానికీ వెన్నెముక లాంటివారు. ఒకరు ఆహారాన్ని అందిస్తే, మరొకరు సరిహద్దుల్లో తిప్పలు పడుతూ మనలను క్షేమం గా ఉంచుతారు. వీరిద్దరూ దేశ ప్రయోజనాల కోసం కష్టపడేవారే. అయితే, దేశ సరిహద్దుల్లో మండే ఎండా అయినా, గడ్డ కట్టే చలి లో అయినా అవిశ్రాంతం గా రక్షణ ను ఇచ్చే ఓ సైనికుడి స్టోరీ ఇది. తప్పకుండ చదవండి.
Video Advertisement
representative image
ఓ సైనికుడు తన విధి నిర్వహణ లో భాగం గా జమ్మూకాశ్మిర్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్నాడు. జమ్మూ కాశ్మిర్ సరిహద్దులంటే.. అక్కడ పరిస్థితులు ఎంత ఘోరం గా ఉంటాయో తెలియనిది కాదు. అయితే, అతను విధులు పూర్తయ్యాక జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్నఏటీఎం వద్దకు వచ్చి వంద రూపాయలను డ్రా చేసేవాడు. అతను ప్రతిరోజు అదే సమయానికి ఆ ఏటీఎం కు వచ్చి వంద రూపాయలను డ్రా చేస్తూ ఉండడాన్ని ఆ ఏటీఎం వాచ్ మాన్ గమనించాడు.
representative image
ఒకరోజు ఆ వాచ్ మాన్ ఉండబట్టలేక ఆ వ్యక్తిని ఇలా అడిగాడు.. ప్రతి రోజూ నువ్వు వచ్చి వంద రూపాయలు మాత్రమే ఎందుకు డ్రా చేస్తున్నావ్..? ఒకేసారి ఎక్కువ మొత్తం తీసుకోవచ్చుకదా.. నా జీవితం లో లక్షల రూపాయలను డ్రా చేసే వ్యక్తులను చాలా మందిని చూసాను. కానీ, నీలా రోజుకు ఒక్క వంద రూపాయలు మాత్రమే ఎందుకు డ్రా చేస్తున్నావ్ అని అడిగాడు. దానికి ఆ సైనికుడు ఓ చిరునవ్వుని బదులిచ్చి ఇలా చెప్పాడు.
representative image
నాకు ఈ మధ్యే పెళ్లి అయింది. కానీ, ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో నా కుటుంబం తో మాట్లాడడానికి వీలు లేదు. నేను రోజూ ఈ సమయం లో వంద రూపాయలు డ్రా చేయగానే, బ్యాంకు నుంచి ఈ అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఆ ఫోన్ నా భార్య వద్ద ఉంటుంది. వారికి ఈ మెసేజ్ వస్తే, నేను బతికి ఉన్నట్లు అర్ధం చేసుకుంటారు. వరుసగా రెండు రోజులు మెసేజ్ రాకపోతే, నేను భరతమాత ఒడిలో నిద్రించానని వారికి తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సైనికుడి సమాధానం విన్నాక ఆ వాచ్ మాన్ కు నోటమాట రాలేదు.
End of Article