Ads
మనలో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ యాక్టర్ ఉంటారు. ఆ యాక్టర్ నటించిన ఏ మూవీ ని అయినా వదలకుండా చూస్తాం. ఆ యాక్టర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ను అయినా వదలకుండా చదువుతాం. మనకి వారి గురించి తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇపుడు, మనం మన ఫేవరెట్ యాక్టర్లు ఏమి చదువుకున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Video Advertisement
#1 అక్కినేని నాగ చైతన్య:
నాగార్జున నట వారసుడు నాగ చైతన్య బీకామ్ వరకు చదువుకున్నారు.
#2 సాయి ధరమ్ తేజ్:
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బయోటెక్నాలజీ లో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తరువాత ఎంబీఏ ను కూడా పూర్తి చేసారు.
#3విశ్వక్ సేన్ :
ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయినా విశ్వక్ సేన్ కూడా బ్యాచిలర్ ఇన్ మాస్ కమ్యునికేషన్ అండ్ జర్నలిజం కోర్స్ ను పూర్తి చేసాడు.
#4 విజయ్ దేవర కొండ:
మన రౌడీ అన్న హైదరాబాద్ అబ్బాయే. విజయ్ కాచిగూడ బద్రుకా కాలేజ్ లో బికాం ను పూర్తి చేసాడు.
#5 రవితేజ:
మాస్ హీరో రవి తేజ బెజవాడ సిద్దార్ద డిగ్రీకాలేజ్ లో బి.ఏ ను పూర్తి చేసారు.
#6 డా.రాజశేఖర్
రాజశేఖర్ డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యారు. రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందే వెటర్నరీ డాక్టరేట్ కోర్స్ ను పూర్తి చేశారు.
#7 అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఎమ్మెస్సార్ కాలేజ్ నుంచి బిబిఎ డిగ్రీని పొందారు.
#8 నాని:
నాచురల్ స్టార్ నాని కూడా డిగ్రీ పూర్తి చేసారు. ఆయన సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీ లో డిగ్రీని పూర్తి చేసారు.
#9 రామ్ చరణ్:
మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ముందునుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. రామ్ చరణ్ తన బీకామ్ డిగ్రీ ని మధ్యలోనే ఆపేసాడు.
#10 జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ ది కూడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కావడం తో చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసాడు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చేసాడు.
#11 ప్రభాస్:
ప్రభాస్ భీమవరం డిఎన్నార్ స్కూల్ లో స్కూలింగ్ ను పూర్తి చేసాడు. ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చి బి టెక్ ను కంప్లీట్ చేసాడు.
#12 రానా:
రానా కూడా ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫిలో బ్యాచిలర్ డిగ్రి ని కంప్లీట్ చేసాడు. చెన్నై ఫిలిం స్కూల్ నుంచి డిగ్రీ పట్టాను పొందాడు.
#13 నాగార్జున:
కింగ్ నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎమ్ ఎస్ పట్టాను పొందారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చేముందు యాక్టింగ్ లో శిక్షణా తీసుకున్నారు.
#14 నందమూరి బాలకృష్ణ
బాలయ్య బాబు నిజాం కాలేజీ లో బి కామ్ డిగ్రీ ని పూర్తి చేసారు.
#15 విక్టరీ వెంకటేష్:
వెంకీ మామ అమెరికా లో ఎంబీఏ పూర్తి చేసారు. ఆ తరువాత ఇండియా కు వచ్చి కలియుగ పాండవులు సినిమా తో యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు.
#16 మహేష్ బాబు:
ప్రిన్స్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజ్ నుంచి బీకామ్ పట్టాను పొందారు.
#17 పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదివారు.
#18 చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నర్సాపూరంలోని వైఎన్ కాలేజ్ లో బీకామ్ ను కంప్లీట్ చేసారు.
#19 కృష్ణ ఘట్టమనేని:
సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీ లో బిఎస్సి చదివారు. ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నించారు. అయితే, అవకాశం లేకపోవడం తో సినిమాల వైపుకు వచ్చేసారు.
#20 శోభన్ బాబు:
శోభన్ బాబు బిఎ పూర్తి చేశారు. ఆ తరువాత లా కూడా చదవాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడం తో సినిమాల వైపు వచ్చారు.
#21 ఎన్టీఆర్:
నందమూరి తారక రామారావు గుంటూరు ఎసి కాలేజ్ లో బి ఏ చదువు పూర్తి చేసారు. ఆ తరువాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్షా రాసారు. 1100 మంది ఈ పరీక్షా రాయగా, వారిలో ఏడుగురు మాత్రమే ఎంపిక అయ్యారు. ఎంపికైన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే, నటన పై ఆసక్తి తోనే వచ్చిన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని కూడా ఎన్టీఆర్ వదులుకున్నారు.
#22 అక్కినేని నాగేశ్వర్రావు:
అక్కినేని నాగేశ్వర్రావు కేవలం మూడవ తరగతి వరకే చదువుకున్నారు. చిన్నప్పటినుంచే ఆయనకు నాటకాలన్న, సినిమాలన్నా మక్కువ ఉండేది. చిన్నతనం నుంచి నాటకాలు వేస్తూ సినిమాలవైపు కు వచ్చారు. దీనితో ఆయన చదువు వైపు వెళ్ళలేదు.
End of Article