నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన నటించేసింది. తెలుగు నాట స్టార్ హీరో అయిన బాలయ్య బాబు తోనూ, తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా మీనా నటించింది. కానీ, ఈ ఫొటోలో ఓ వైపు బాలయ్య, మరో వైపు సూపర్ స్టార్ తలైవా ఉండగా ఈ ఫోటో తీశారు.

Video Advertisement

బాలయ్య, రజినీకాంత్, మీనా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీనా అందరు హీరోలతోనూ కలిసి నటించినప్పటికీ, ఇరు భాషల స్టార్ హీరోలతో మీనా చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటో ను ఎప్పుడు తీశారు.. ఏ సినిమాలోది అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. మీనా వారిద్దరిని ఎప్పుడు కలిసింది అని చర్చిస్తున్నారు. 1998 వ సంవత్సరం వరకు స్టార్ హీరోయిన్ గా మీనా తెలుగు నాట కొనసాగింది. ఈ స్టిల్ కూడా బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ ప్రారంభ సమయం లోనిది.

బొబ్బిలి సింహం సినిమా ముహూర్తం షాట్ కు సూపర్ స్టార్ రజిని హాజరు అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతం లో ఈ సినిమా షూటింగ్ ను లాంఛనం గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకోసం తలైవా రజినీకాంత్ హాజరు అయ్యారు. అప్పట్లోనే బాలయ్యబాబు కు, రజిని కి మంచి స్నేహం ఉంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు రజిని ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భం లోనే మీనా, బాలయ్య, రజిని ముచ్చటించుకుంటున్న సమయం లో ఫోటో తీశారు.


End of Article

You may also like