ఇంత క్యూట్ గా ఉన్నాడు… ఈ అబ్బాయి ఓ స్టార్ హీరో కొడుకు అని తెలుసా..?

ఇంత క్యూట్ గా ఉన్నాడు… ఈ అబ్బాయి ఓ స్టార్ హీరో కొడుకు అని తెలుసా..?

by Anudeep

Ads

చిన్న పిల్లలు ఎప్పుడూ క్యూట్ లుక్స్ తో ముద్దు గా ఉంటారు. అందులో స్టార్ హీరో కిడ్స్ అయితే వారిపై ఉండే ఫోకస్ వేరే లెవెల్ అసలు. ఈ ఫోటో లో ఉన్న అబ్బాయి కూడా ఓ స్టార్ హీరో కిడ్. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో ఈ ఫోటోలను క్లిక్ అనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయిపోతున్నాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో.. ఈ కిడ్ విశేషాలేంటో.. మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Video Advertisement

ajith son feature

ఇంత ముద్దుగా ఉన్న ఈ బుడతడి పేరు అద్విక్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి కొడుకు. అజిత్ వాళ్ళ ఫామిలీ లో జరిగిన ఓ పెళ్లి ఫంక్షన్ లో ఈ బుడ్డోడిని కూడా ఫోటో లు తీశారు. క్యూట్ లుక్స్ తో ఉన్న బుడ్డోడు ఉన్నట్లుండి ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం హీరో అజిత్ తమిళనాట వరస సినిమాలతో బిజీ గా ఉంటున్నాడు. తెలుగులో ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమాలో నటించిన అజిత్ తమిళనాట మాత్రం బాగా ఫేమస్ అయ్యి సత్తా చాటుతున్నాడు.

ajith son 2

కేవలం యాక్టర్ గానే కాకుండా, అజిత్ బైక్ రేసర్ గా కూడా సుపరిచితం. అజిత్ కు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. తన సినిమాలలో కూడా బైక్ రేసింగ్ తో ఛేజింగ్ ఉండేలా చూసుకుంటాడు. అలాగే డైరెక్టర్లు కూడా అజిత్ టాలెంట్ తెలుసు కాబట్టి మస్తు గా యాక్షన్ సీన్ లను ప్లాన్ చేస్తుంటారు. వరుస హిట్ లతో దూసుకెళ్తున్న తమిళ సూపర్ స్టార్ తల అజిత్‌ కు బైక్ లంటే అంత పిచ్చి మరి. అజిత్ లాగానే, అజిత్ కిడ్ అద్విక్ కూడా క్యూట్ గా ముద్దొస్తున్నాడు కదా.. అద్విక్ కూడా పెద్దయ్యాక రేసర్ అవుతాడో..లేక తండ్రి లాగ సినిమా హీరో అవుతాడో చూడాలి. అజిత్ ఫాన్స్ మాత్రం ఎంతగానో ముద్దొస్తున్న అద్విక్ ఫోటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు.


End of Article

You may also like