Ads
సినిమా రంగుల ప్రపంచం లో టాలెంట్ ఉన్నోళ్లకి అవకాశాలు దండిగానే ఉంటాయి. ఆ విషయాన్నీ మన హీరోయిన్లను చూస్తేనే చెప్ప్పచ్చు. నటీమణులుగా చలామణి అవుతూ, సింగర్స్ గా కూడా పేరు తెచ్చుకున్నారు కొందరు హీరోయిన్లు. ఆ హీరోయిన్ల లిస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Video Advertisement
1. రాశి ఖన్నా:
అందం, అభినయం తో కుర్రకారుని కట్టిపడేస్తున్న రాశి ఖన్నా సింగర్ కూడా. ఆమె చాలా చక్కగా పాటలు పాడుతుంది. ‘ఊహలు గుస గుస లాడే’ సినిమా లో సాయి శిరీష పద్మావతి గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశి ఖన్నా వరుస గా చాలా సినిమాల్లో తన టాలెంట్ తో ఆకట్టుకున్నారు. తొలిప్రేమ సినిమా కూడా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. జోరు, విలన్ సినిమాలలో టైటిల్ సాంగ్స్ లో రాశి ఖన్నా ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది. అంతే కాదు బాల కృష్ణుడు సినిమా లో తరిరా సాంగ్, జవాన్ సినిమా లో బాగారు సాంగ్స్ కి కూడా వాయిస్ ను ఇచ్చింది.
2. ఆండ్రియా
ఆండ్రియా కూడా హీరోయిన్ కాకముందు పాపులర్ సింగర్. ఆమె అంత ప్యాషన్ తో మరే ఇతర హీరోయిన్ పాడలేదు. సింగర్ గానే కాదు, నటి గా కూడా ఆండ్రియా అద్భుతమైన అమ్మాయి. అపరిచితుడు సినిమా లో “కన్నుమ్ కన్నుమ్ నోకియా” పాటను, బొమ్మరిల్లు లో ” వుయ్ హావ్ ఏ రోమియో” పాటను, దడ లో “దివాలి దీపాన్ని” సాంగ్ ని, భరత్ అనే నేను సినిమాలో “ఇది కలలా ఉన్నదే..” పాటకి కూడా ఆండ్రియా వాయిస్ ఇచ్చింది. అన్ని సూపర్ హిట్ సాంగ్సే కదా.
3. మమతా మోహన్ దాస్:
మమతా మోహన్ దాస్ కూడా అభినయం ఉన్న నటి. ఆమె సింగర్ కూడా. టెలివిజన్ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సమయం లో ఆమె వెండితెర వైపుకు వచ్చారు. మలయాళం లో నాలుగు షో లకు ఆమె హోస్ట్ గా వ్యవహరించారు. “కైయిల్ ఓరు కోడి”, ఢీ 4 డాన్స్ రీలోడెడ్,” “ఢీ 4 డాన్స్ జూనియర్ వర్సెస్ సీనియర్”, “హ్యాండ్ ఆఫ్ గాడ్ ” షో లకు హోస్ట్ గా వ్యవహరించారు. సింగింగ్ లో కూడా మమతా రాణించారు. పాటలు పాడడం లో ఆమెకు ఆమే సాటి. ఈమెకూడా చాలా పాటలకు ప్లే బ్యాక్ సింగర్ గా ఉన్నారు. వాటిలో పేరు తెచ్చినవి రాఖి టైటిల్ సాంగ్, శంకర్ దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్, ఇంకా జగడం లో 36-26-24 అంటూ సాగే ఒక సాంగ్ కూడా.
4. నిత్యా మీనన్:
అలా మొదలైంది సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ కూడా మంచి సింగర్. ఆమే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. యాక్టింగ్ పరం గా నిత్యా మీనన్ తన ప్రతి సినిమాలోనూ చెరగని ముద్ర వేసింది. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా.. నటన పరం గా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసుకుంటూ వచ్చింది. స్క్రీన్ ప్రెజన్స్ తో పాటు ఇష్క్, 24 , గుండె జారీ గల్లతయ్యిందే, జబర్దస్త్ వంటి సినిమాల్లో సింగర్ గా కూడా టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.
5. శృతి హాసన్:
కమల హాసన్ డాటర్ అయినప్పటికీ, శృతి హాసన్ తనంతట తానూ గా సినీ ఇండస్ట్రీ లో ఎదిగారు. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎంత చక్కగా పాటలు పాడతారో కొత్తగా చెప్పక్కర్లేదు. హే రామ్, ఈనాడు, లక్, ఓ మై ఫ్రెండ్, త్రీ , ఆగడు, రేసు గుర్రం, పులి సినిమాలతో శృతి సింగర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు నాట చాలా సినిమాలతోనే శృతి ఆకట్టుకున్నప్పటికీ, అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాలోని స్పందన పాత్ర శృతి హాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
End of Article