Ads
సినీ ఇండస్ట్రీ నిలదొక్కుకోవడానికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కావాలి. అదే ప్రతిభ కు తగ్గ అవార్డు లభించాలన్నా కూడా ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ఓ సినిమా లో నటన కి అవార్డు వస్తేనే పొంగిపోయే వారు బోలెడు మంది ఉంటారు. కానీ, సినిమా అవార్డుల సంగతి పక్కన పెట్టి ఏకం గా గిన్నిస్ బుక్ లోనే రికార్డు కొట్టేస్తే..? అలాంటి వ్యక్తుల వెనక ఎంత కృషి..పట్టుదల ఉండి ఉండాలి. వారు మిగిలిన వారికి ఆదర్శం కూడా. అలా టాలీవుడ్ లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న 6 సెలెబ్రిటీస్ వీళ్ళే. ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదివేయండి మరి.
Video Advertisement
1. విజయ నిర్మల:
విజయ నిర్మల గారు 2000 సంవత్సరం లోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. చిన్న వయసు లోనే సినీ ఇండస్ట్రీ కి వచ్చిన విజయనిర్మల తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 42 సినిమాలను డైరెక్ట్ చేసి రికార్డు సృష్టించారు.
2. బ్రహ్మానందం:
ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే కామెడీ పండించేయగల మహానుభావుడు. మరో వందేళ్లయినా కామెడీ అంటే ఆయన పేరే గుర్తొస్తుంది. కమెడియన్స్ లో లెజెండ్ ఎవరు అంటే బ్రహ్మానందమే. ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకుగాను 2010 లో గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు.
3. సుశీల:
సుశీల గారికి గాన కోకిల అనే బిరుదు ఉంది. ఆమె 18 వేల పాటలు పాడి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికి ఆమె పాటలు మోగుతూనే ఉంటాయి.
4. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం:
ఎస్పీ బాల సుబ్రమణ్యాన్ని మనం గాన గంధర్వుడు గా పిలుచుకుంటాం. ఈయన ఏకం గా నలభై వేల పాటలు పాడి రికార్డు సృష్టించారు. 2001 లో బాలు గారు గిన్నిస్ బుక్కులోకెక్కారు. దురదృష్టవశాత్తు, కరోనా కారణం గా మనం బాలు గారిని పోగొట్టుకున్నాం.
5. గజల్ శ్రీనివాస్:
ఈయన గజల్స్ బాగా పాడతారు. వంద భాషల్లో వంద గజల్స్ ను పాడి సింగర్ గా గిన్నిస్ లో చోటు దక్కించుకున్నారు. ఈయన పేరు 2008 లో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
6. డా.రామానాయుడు:
ఎక్కువ సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ గా డా.రామా నాయుడు గారు గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. రామానాయుడు గారు పదమూడు భాషల్లో మొత్తం 150కి పైగా సినిమాలను నిర్మించారు. ఎక్కువ సినిమాలను నిర్మించినందుకు గాను ఈయన పేరు ను 2008 లో గిన్నిస్ బుక్ లో రికార్డు చేసారు.
End of Article