Ads
మొత్తానికీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” టీజర్ వచ్చేసింది. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మెగాస్టార్ వరుసగా సెలెక్టివ్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ జోరు మీద ఉన్నారు. అయితే, కరోనా కారణం గా ఆచార్య రావడం కాస్త ఆలస్యమవుతోంది. లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తాం అన్న చందం గా టీజర్ ను కట్ చేసారు. ఈ టీజర్ కమర్షియల్ హంగులు అద్దుకున్నప్పటికీ .. మెగా అభిమానులకు మాత్రం ఫుల్ ఫీస్ట్ గా ఉంది.
Video Advertisement
మెగాస్టార్ “సైరా” సినిమా కూడా చారిత్రాత్మక నేపధ్యం లో రూపొందించారు. ఈ సినిమా కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. అదే ఊపుతో కమర్షియల్ తరహా లో “ఆచార్య” ను కొరటాల రూపొందిస్తున్నాడు. కొణిదెల ప్రో కంపెనీ, మాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తం గా కలిసి ఈ సినిమా ను నిర్మిస్తున్నాయి. టీజర్ లోనే భారీ డైలాగులతో ఈ సినిమా పై మంచి హైప్ తీసుకొచ్చాడు కొరటాల.
మొత్తానికి ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి.. ఈ టీజర్ స్టార్టింగ్ లో నే “ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం… అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు” అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. ఆ డైలాగ్ ప్లే అవుతుండగా మెగాస్టార్ ఎంట్రీ కనిపిస్తుంది. మణిశర్మ క్రియేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అంతే..
టీజర్ అంతా ఎక్కువ భాగం చిరు పైనే ఫోకస్ చేసినప్పటికీ సినిమా పై ఉత్కంఠ పెరుగుతూనే ఉంటుంది. దానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ కారణం. బ్యాక్ గ్రౌండ్ లో “ఆచార్య దేవో భవ”.. ” ఆచార్య రక్షో భవ” అన్న స్లోగన్లు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ అదనపు ఆకర్షణ గా నిలిచాయి. “నేనేమి పాఠాలు చెప్పకపోయినా.. నన్నందరూ ఆచార్య అని పిలుస్తుంటారు ఎందుకో.., బహుశా గుణ పాఠాలు చెబుతుంటాననేమో..” అని చిరు చెప్పిన డైలాగ్ ఈ టీజర్ కె హైలైట్ గా నిలిచింది. ఈ ఏడాది సమ్మర్ లో “ఆచార్య” థియేటర్లో పలకరించనుంది.
watch video:
End of Article