Ads
ప్రభాస్ కి తల్లి గా హేమ మాలిని..!
“రాధేశ్యామ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ “ఆది పురుష్”పై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. బాహుబలి తరువాత సినిమా ల ఎంపిక లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభాస్.. జోరును కూడా బాగా పెంచాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ “ఆదిపురుష్ ” సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.
Video Advertisement
ఇందులో ప్రభాస్ శ్రీ రాముని పాత్రను పోషిస్తున్నాడు. అలానే, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలోకి మరొక స్టార్ వచ్చి చేరారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లి గా అంటే కౌసల్య పాత్రను పోషించనున్నారట. ఈ సినిమా లో సీత పాత్ర కింద కృతిసనన్ ను అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
End of Article