Ads
సాధారణం గా తెలుగు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు ముంబై , బాలీవుడ్ నుంచి వచ్చే భామలనే వరిస్తుంటాయి. తెలుగు అమ్మాయిలు అంత ఫ్రీ గా నటించలేరు అన్న అపోహ.. మరేదైనా కారణం తోనో వారికి తక్కువ అవకాశాలు వస్తూఉంటాయి. అయితే, ఈషా రెబ్బ మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తో ఈషా వెండితెరకు పరిచయం అయింది.
Video Advertisement
ఆ తరువాత ఆమెకు అందివచ్చిన అవకాశాలతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఈషా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పిట్టకథలు’ సినిమాలలో నటిస్తోంది. తాజాగా, ఈమెకు గుణశేఖర్ “శాకుంతలం” సినిమా లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పౌరాణికం సినిమాలో ఈషా రెబ్బ సమంత కు చెలికత్తెగా కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
End of Article