Ads
సినిమా హిట్ అవ్వాలి అంటే.. అందులో కామెడీ పండాలి. ఆహ్లాదకరం గా నవ్వించే కామెడీ ని పండించాలి అంటే.. కమెడియన్ అనే రైతు సినిమా అనే పంటపొలం లో కష్టపడాల్సిందే. అలా.. సినీ ఇండస్ట్రీ లో కష్టపడి మనలని నవ్వించి.. చివరికి మనకి దూరం అయిపోయిన కమెడియన్లను ఓ సారి తలచుకుందాం.
Video Advertisement
#1 ఎమ్మెస్ నారాయణ:
ఎమ్మెస్ నారాయణ కామెడీ రంగం లో బహుముఖ ప్రజ్ఞా శాలి. దొంగ, ప్రిన్సిపాల్, ఇంటి యజమాని, టీ షాప్ యజమాని, బాస్, డాక్టర్ వంటి పాత్రల్లో ఆయన ఇమిడిపోయి నటించారు. “బన్నీ,” “చిరుత,” “ఇంద్ర ”మొదలైన తెలుగు చిత్రాల్లో ఎమ్మెస్ నారాయణ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. “మా నాన్నకు పెళ్లి”, “దూకుడు” సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన శరీరం లో పలు అవయవాలు ఫెయిల్ అవడం తో 2015 లో ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
#2 వేణుమాధవ్:
కమెడియన్ గా వేణు మాధవ్ ప్రస్థానం అందరికి తెలిసినదే.. ఆయన కెరీర్ లో ఎంత వెలుగు ఉందొ.. సినిమాల్లోకి రాకముందు ఆయన జీవితం లో అంత చీకటి ఉండేది. వేణుమాధవ్ కు మిమిక్రి పై ఇంటరెస్ట్ ఉండేది. రవీంద్ర భారతి లో ఆయన ఇచ్చిన ఓ ప్రదర్శన వేణు మాధవ్ జీవితాన్నే మార్చేసింది. సంప్రదాయం సినిమా తో వెండితెరకు పరిచయమైన వేణు మాధవ్.. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. శ్రీ రామ చంద్రులు, దిల్, సై, ఆంధ్రావాలా, ఛత్రపతి.. ఇలా వేణుమాధవ్ హిట్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. కాలేయ సంబంధ వ్యాధి తో వేణుమాధవ్ 2019 లో మరణించారు.
#3 ఆహుతి ప్రసాద్:
ఆహుతి ప్రసాద్ కు చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే అమితమైన ప్రేమ ఉండేది. చదువు పూర్తి అయిపోయాక ఆహుతి ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. “విక్రమ్” సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన ఆహుతి అనే సినిమాలో ఓ రోల్ ని చేసారు. ఆ సినిమా ఆయనకు ఎంత పేరు తెచ్చిపెట్టింది అంటే.. చివరకు ఆ సినిమా పేరు కూడా అయన పేరు పక్కన స్థిరపడిపోయింది. కాన్సర్ తో పోరాడుతూ.. ఆహుతి ప్రసాద్ 2015 తుదిశ్వాస విడిచారు.
#4 కళ్ళు చిదంబరం:
కొల్లూరు చిదంబరం ఆయన కళ్ళతోనే మనకి గుర్తుండిపోయారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనను “కళ్ళు” చిదంబరం గా పిలుస్తుంది. అంతే కాదు. ఆయన నటించిన కళ్ళు సినిమా ఆయనకీ మంచి గుర్తింపు ను తెచ్చింది. ఆయనకు ఈ సినిమాకి గాను రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తెలుగు లో ఆయన నటించిన “అమ్మోరు” సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చిదంబరం సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన ఇంజనీర్ గా పనిచేసేవారట. ఆయన కూడా 2015 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
#5 ధర్మవరపు సుబ్రహ్మణ్యం:
ప్రభుత్వ అధికారి అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం నాటకాలు, సినిమాలపైనే మక్కువ తో తెలుగు ఇండస్ట్రీ కి వచ్చారు. జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో ఆయనకు అవకాశం లభించింది. అదే ఆయన మొదటి సినిమా. ఆ తరువాత పలు సినిమాల్లో ఆయన నటించారు. అధ్యాపకుడిగా ధర్మవరపు పూయించిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. అయితే కొందరు మరీ ఆ పాత్రలను కించ పరుస్తుండడం తో ఆ పాత్రలకు స్వస్తి పలికాడు. ఒక్కడు, వర్షం, నువ్వునేను, ధైర్యం, ఆలస్యం అమృతం సినిమాలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆరు నెలల పాటు కాలేయ కేన్సర్‌తో బాధపడి 2013 లో ఆయన ఈ లోకాన్ని విడిచెళ్ళిపోయారు.
#6 కొండవలస:
మీకు “అయితే ఒకే ” డైలాగ్ ఇప్పటికి గుర్తుందంటే దానికి కారణం కొండవలసే. కమెడియన్ గా ఆయన “అయితే ఒకే” పదాన్ని పలుకుతూ కామెడీ ని పండించారు. “అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు” సినిమా కొండవలస కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రత్యేకమైన యాసలో కామెడీ ని పండించడం ఆయనకే చెల్లింది. కొండవలసకు తీవ్రమైన చెవి కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండేదట. దానివల్లనే ఆయన 2015 లోనే మృతి చెందారు.
#7 జయప్రకాశ్ :
బ్రహ్మపుత్రుడు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి పలు సినిమాల్లో కమెడియన్ గా విలన్ గా ఆకట్టుకున్నారు. ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన రాయలసీమ యాసలో ఆయన కామెడీ ని పండించారు. దాదాపు పాతిక సినిమాలు చేసాక.. ఆర్ధికం గా ఇబ్బందులు ఎదురవ్వడం తో గుంటూరు కు వెళ్ళిపోయి కొంతకాలం టీచర్ గా పనిచేసాడు. అనుకోకుండా ఆయనకు ప్రేమించుకుందాం రా సినిమా లో ఛాన్స్ ఇచ్చారు. అందులో విలన్ పాత్ర జయప్రకాశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన తండ్రి గారు బదిలీలు అవుతుండడం వలన ఆయనకు పలు ప్రాంతాల్లోని భాషలపై పట్టు లభించింది.
#8 తెలంగాణ శకుంతల:
తెలంగాణ యాసతో అబ్బురపడేవిధం గా మాట్లాడే నటి రాష్ట్రము పేరునే తన పేరు పక్కన చేర్చుకుంది. రాయలసీమ మాండలికాన్ని కూడా ఆమె అద్భుతం గా పలికించగలరు. “మా భూమి” చిత్రంతో ఆమె తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. కామెడీ పాత్రలతో పాటు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా శకుంతల అద్భుతం గా నటించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అకస్మాత్తు గా గుండెపోటు రావడం తో ఆమె జూన్ 2014 లో మృతి చెందారు.
#9 బండ్ల జ్యోతి:
తేలికపాటి హాస్యం తో అమితం గా నవ్వించే వ్యక్తి గా బండ్ల జ్యోతి పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెస్ నారాయణ వంటి పలువురు ప్రముఖ హాస్యనటులతో ఆమె కలిసి నటించారు. “ఆమె”, “భద్రాచలం”, “గణేష్” వంటి చిత్రాలలో ఆమె నారాయణ, ఎంవిఎస్ వంటి నటులతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చిన్నవయసులోనే దురదృష్టవశాత్తు గుండెపోటు కారణం గా మృతి చెందింది.
#10 కమెడియన్ ఏవిఎస్ :
ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. కమెడియన్ గా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడి గా కూడా పరిచయం చేసారు. మిష్టర్ పెళ్ళాం సినిమాలో ‘తుత్తి’ మ్యానరిజం తో అలరించిన ఏవీఎస్, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’ డైలాగును , అలానే శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’ లాంటి డైలాగులు వేసి అలరించారు. నటనే కాకుండా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసారు. కాలేయ సంబంధ వ్యాధితోనే ఏవీఎస్ 2013 లో మృతి చెందారు.
End of Article