Ads
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. నటులుగా తమను ప్రూవ్ చేసుకుంటూ ఎదగాలని చాలామంది కోరుకుంటారు. కొందరికి చిన్నతనం లోనే ఆ అవకాశం కలిసొస్తుంది. అలా.. చిన్నతనం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి.. ఆ తరువాత హీరో/హీరోయిన్లు గా ఎదుగుతుంటారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హీరోయిన్ అయిన వాళ్లలో..ఈ పాప కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ “బద్రి” సినిమా లో నటించిన ఈ పాపను గుర్తుపట్టారా..? ఈమె ఎవరో ఇపుడు తెలుసుకుందాం.
Video Advertisement
ఈ పాప పేరు చేతన. బద్రి సినిమాలో.. పవన్ కళ్యాణ్ ఓ బెంచ్ పై కూర్చుని బాధపడుతున్న సమయం లో.. ఈ పాప అక్కడకి వచ్చి ఎందుకు బాధపడుతున్నారు అంకుల్.. అంటూ పవన్ ను అడుగుతుంది. పక్కనే వచ్చి కూర్చుని నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా.. అంటూ పవన్ ను ఆటపట్టిస్తుంది.. ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఈ పాప ఇప్పుడు చాలా పెద్దదైంది. టాలీవుడ్ రచయితా, నటుడు అయిన ఉత్తేజ్ కూతురే ఈ చేతన. ఇప్పుడు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తోంది.
2017 లో ఈమె “పిచ్చి గా నచ్చావ్” అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. బద్రి సినిమాలో నటించిన తరువాత ప్రియమైన నీకు, అవునన్నా కాదన్న, భద్రాచలం, పౌర్ణమి.. ఇలా దాదాపు డజను సినిమాల్లో నటించిందట.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసాక ఆమె ధ్యాస చదువు వైపుకు మళ్లింది. చేతన మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె కుటుంబ నేపధ్యం కూడా సినిమా ఇండస్ట్రీ నే కావడం తో తిరిగి సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఆమె తిరిగి హీరోయిన్ గా నటించడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
End of Article