Ads
“జబర్దస్త్”.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ ఖతర్నాక్ కామెడీ షో ఎందరికో లైఫ్ ఇచ్చింది. ఇంటింటిలోను నవ్వులు పూయించింది. అలా జబర్దస్త్ లో లేడీ గెట్ అప్స్ వేసుకుంటూ కూడా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో హరి అలియాస్ హరిత కూడా ఒకరు. హరి లేడీ గెట్ అప్ వేసుకున్నారంటే.. ఈమె అమ్మాయి కాదు..అబ్బాయి అని చెప్పినా ఎవరు నమ్మరు. అతను అంతలా అమ్మాయిగా మారిపోతాడు. ఇటీవల, అతను ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పర్సనల్ జీవితానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. అవేంటో.. ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
హరిత జబర్దస్త్ కి రాకముందు.. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న పలు ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.. ఓ ఫోన్ కాల్ వలన తానూ ఇండస్ట్రీ కి వచ్చానని కానీ మొదట్లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. పేర్లు బయటకు చెప్పలేను.. కానీ, అవకాశాల కోసం తిరిగినప్పుడు… క్యారెక్టర్ ఉందని ఫోన్ చేస్తారు…తీరా హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేవారన్నారు. చాలా సార్లు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు కాదన్నారు. చివరకు బస్టాండ్ లో కూర్చుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని ఆ రోజుల్ని తలచుకుని దుఃఖించారు.
చాలా మంది తనని చూసి బాగా ఉన్న వారి కుటుంబం నుంచి వచ్చి ఉంటానని అనుకుంటారని చెప్పుకొచ్చారు. కానీ, మాది చాలా పేద కుటుంబమని, ఒక పూట తింటే..రెండు, మూడు రోజులు పస్తులు ఉండాల్సి వచ్చేదని జబర్దస్త్ కు రాకముందు లైఫ్ ను హరి గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారంటే.. దాని వెనుక ఏళ్ల తరబడి శ్రమ, కష్టం ఉంటాయి.. వాటిని గుర్తించి స్ఫూర్తి పొందాలి.
watch video:
End of Article