Ads
విడుదల కి ముందునుంచి “ఉప్పెన” పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా గతేడాదే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా కారణం గా వాయిదా పడింది. అయితే.. లాక్ డౌన్ టైం నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. ఎలా అంటే.. వరుస గా గ్యాప్ ఇస్తూ పాటలను విడుదల చేసారు. ఈ పాటలు బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై బాగా హైప్ వచ్చింది.
Video Advertisement
దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కావడం, మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్, తొలి పాట తోనే కుర్రకారుని కట్టిపడేసిన హీరోయిన్ కృతి శెట్టి.. ఇలా ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి చాలానే కారణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో కూడా పాటలు అంతే బాగా పిక్చరైజ్ చేశారు. స్టొరీతో పాటు పాటలు కూడా అలా వెళ్లిపోతాయి. దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాకి తెరవెనుక హీరో అని చెప్పొచ్చు.
భారీ అంచనాలతో ఉన్న ఉప్పెన సినిమా నిన్న (ఫిబ్రవరి 12) విడుదలయింది. ఈ సినిమా కి విడుదలకి ముందే దాదాపు ఇరవైన్నర కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని అంచనా. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడానికి కనీసం 21 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే.. అంచనాలను నిజం చేస్తూ.. ఉప్పెన తొలి రోజే 10.42 కోట్ల బిజినెస్ తో బోణీ కొట్టేసింది. జిల్లాల వారీగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
అందరి కంటే ఎక్కువ గా నైజాం లో ఉప్పెన 3.08 కోట్లు రాబట్టింది. సీడెడ్ ప్రాంతాల్లో 1.35 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్ర లో 1.43 కోట్లు, ఈస్ట్ లో 0.98 కోట్లు, వెస్ట్ లో 0.81 కోట్లను రాబట్టింది. కృష్ణా జిల్లాలో 0.62 కోట్లను, గుంటూరు జిల్లా లో 0.65 కోట్లను రాబట్టుకోగలిగింది. నెల్లూరు జిల్లాలో 0.35 కోట్లను రాబట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప్పెన 9.30 కోట్లను తొలిరోజు రాబట్టింది.
భారత్ లోని ఇతర ప్రాంతాల్లో కలిపి 0.78 కోట్లను రాబట్టుకుంది. ఓవర్సేస్ లో 0.34 కోట్లను రాబట్టుకుంది. మొత్తం గా ఈ సినిమా తొలి రోజు 10.42 కోట్ల రూపాయలను రాబట్టుకుంది. డెబ్యూ గా వచ్చిన తొలి సినిమా లో రికార్డు స్థాయి లో వైష్ణవ తేజ్ కలెక్షన్లను రాబట్టగలిగాడు.
End of Article