Ads
సెలెబ్రిటీలు తమ జీవితం లోని చాలా విషయాలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా యుగం వచ్చాక ఇటీవల చాలా విషయాలు పబ్లిక్ లోనే ఉంటున్నాయి. ఈ క్రమం లో కొందరు అతిగా స్పందిస్తుంటారు. అవి మనకు చిరాకు తెప్పిస్తుంటాయి.. ఎక్కువ గా ఇలాంటివి సెలెబ్రిటీల జీవితం లో జరుగుతూ ఉంటాయి. అయితే సాధారణ యూజర్ల కంటే.. సెలెబ్రిటీలు మరింత ఎక్కువ జాగ్రత్త గా స్పందించాల్సి ఉంటుంది.
Video Advertisement
ఎందుకంటే.. వారి లైఫ్ పబ్లిక్ లో ఉంటుంది. వారిని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమం లో ఇటీవల అమితాబ్ మనవరాలు తాను ఎదురైన కౌంటర్ కి ధీటు గా సమాధానం ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అమితాబ్ మనవరాలు నవ్య నవేలీ ఫోర్డామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ‘ఆరా హెల్త్’ పేరుతొ ఓ హెల్త్ కేర్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా లో పంచుకుంటూ.. తమ ఫామిలీ లో అందరు మహిళలు ఏదొక పని చేసుకుంటూనే ఉన్నామని పేర్కొంది.
దీనికి ఓ కొంటె నెటిజెన్.. మీ అమ్మకు ఉద్యోగం లాంటి పనులు ఏమి లేవు కదా అంటూ కామెంట్ చేసాడు. దీనితో, నవ్య దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. ఆమె మాకు తల్లి, రైటర్, డిజైనర్, హౌస్ వైఫ్” అంటూ పేర్కొంది. ఒక స్టేటస్ ను కూడా షేర్ చేసింది. “ఒక మహిళ భార్య గా, తల్లి గా ఉండడం కూడా ఫుల్ టైం జాబ్ లాంటిదేనని, తక్కువ చేసి చూడక్కర్లేదని, వారికి సపోర్ట్ గా ఉండాలి తప్ప ఇలా అవమానించకూడదని” గట్టి గా కౌంటర్ ఇచ్చింది.
End of Article