Ads
“నీ కన్ను నీలి సముద్రం” పాటతో కృతిశెట్టి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. విడుదల కి ముందునుంచి “ఉప్పెన” పై భారీగానే అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ టైం నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. పాటలు బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై బాగా హైప్ వచ్చింది.
Video Advertisement
దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కావడం, మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్, తొలి పాట తోనే కుర్రకారుని కట్టిపడేసిన హీరోయిన్ కృతి శెట్టి.. ఇలా ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి చాలానే కారణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ క్రమం లో ఈ సినిమాకి ఎవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అన్న సంగతి చర్చల్లోకి వస్తోంది.
ఈ సినిమా తో కృతి శెట్టి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమా రిలీజ్ కి ముందే ఆమె ఇతర సినిమాలకి సైన్ చేసేసింది కూడా. అయితే, ఉప్పెన తరువాత ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచేసింది అని ఫిలిం వర్గాల్లో టాక్ కూడా వచ్చేసింది. ఇటీవల నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వార్తల్లో కృతి శెట్టి 60 లక్షలు రెమ్యునరేషన్ గా డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు ఇందుకు కూడా సై అంటున్నారట.
ఇది తెలియగానే, అసలు ఉప్పెన కి ఈమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారట. ఆరులక్షల రెమ్యునరేషన్ తో కృతి శెట్టి ఈ సినిమా లో నటించిందట. ఇది కాక, కృతి శెట్టి కి తెలుగు నేర్పించడానికి కూడా ఓ టీచర్ ని పెట్టారట. నిర్మాత సుకుమార్ స్టూడెంట్ నే టీచర్ గా పెట్టి తెలుగు నేర్పించారట. ఈ లెక్క న చూసుకుంటే ఇప్పుడు కృతి శెట్టి పదిరెట్లు ఎక్కువే డిమాండ్ చేస్తోంది. అయినా, అందం, టాలెంట్ ఉన్న అమ్మాయి డిమాండ్ చేసినా తప్పులేదు లెండి. ఏమంటారు..?
End of Article