Ads
జయసుధ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మన ఇంట్లో అమ్మ లాగానో, పిన్ని లాగానో, లేదంటే అమ్మమ్మ లాగానో కనిపించే నిండైన రూపం. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి గా, నానమ్మ గా కూడా పాత్రలు పోషించి కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఆమెకు చాలా మంది అభిమానులే ఉన్నారు తప్ప హేటర్స్ ఎవరు లేని నటి గా ఆమె పేరు ప్రఖ్యాతలు గడించారు.
Video Advertisement
అయితే, ఇటీవల ఆమె ఓ వీడియో ను విడుదల చేసారు. ఈ వీడియో ను చూసి అందరు జయసుధ కు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. దానికి కారణం ఆమె బాగా చిక్కిపోయి కనిపించడం. ఆమె జుట్టు కూడా బాగా నెరిసిపోయి కనిపించడం తో జయసుధ ఏమైనా అనారోగ్యం బారిన పడ్డారా? అన్న అనుమానాలు కూడా అభిమానులకు కలుగుతున్నాయి. మూడు తరాలు గా టాప్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జయసుధ అకస్మాత్తు గా ఇలా కనిపించడం తో అభిమానులు ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారు.
బుల్లి తెరపై ప్రసారం కానున్న ఓ సీరియల్ గురించి మాట్లాడడానికి ఆమె కెమెరా ముందు కు వచ్చారు. బుల్లి తెరపై ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది. జయసుధ తాజాగా రిలీజ్ చేసిన వీడియో లో ఈ సీరియల్ టీం కి ఆమె బెస్ట్ విషెస్ తెలిపారు. సినిమా మాత్రమే కాదని, సీరియల్ తో కూడా తాను ముందుకు వస్తున్నానని ఆమె వీడియో ద్వారా తెలిపారు. గతం లో శోభన్ బాబు తో కలిసి జయసుధ “జానకి కలగనలేదు..రాముని సతి కాగలనని ఏనాడు..” అన్న పాటలో నటించారు.
ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాట సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ పాటలో మొదటి లైన్ ను సీరియల్ కి పేరుగా పెట్టారు. ఈ సీరియల్ గురించే జయసుధ ఈ వీడియో లో మాట్లాడారు. అయితే, ఆమె బరువు తగ్గినట్లు, ముఖం కూడా పీక్కుపోయినట్లు కనిపించడం తో ఆమె ఆరోగ్యం పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
1970 ల కాలం లోనే జయసుధ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లే కాదు, దాదాపు అందరు స్టార్ హీరోలతో కూడా ఆమె తెరను పంచుకున్నారు. 1990 లకు వచ్చేసరికి జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించడం ప్రారంభించారు.
తల్లి, వదిన, అత్త వంటి పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఈ పాత్రల్లో ఒదిగిపోయారు. గతం తో పోలిస్తే ప్రస్తుతం కొంతమేర సినిమాలు తగ్గించినప్పటికీ, ఆమెకు ఉన్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు “మహర్షి” సినిమా లో కూడా జయసుధ అమ్మగా కనిపించారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. ఎప్పట్లానే సినిమాలతో, సీరియల్స్ తో అలరించాలని కోరుకుందాం..
End of Article