Ads
వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కొన్ని సంవత్సరాల తర్వాత శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఓపెనర్ లో అజేయంగా నిలిచారు. 35 బంతుల్లో 80 పరుగులు చేసి ఇండియా లెజెండ్స్ జట్టును గెలిపించారు. కరోనా కారణంగా గత సంవత్సరం నాలుగు మ్యాచ్ ల తర్వాత వాయిదా పడిన ఈ సిరీస్ శుక్రవారం రాయ్‌పూర్ లో షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తిరిగి ప్రారంభమైంది.
Video Advertisement
బంగ్లాదేశ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగుల స్కోర్ తో ఆలౌట్ అయ్యింది. నజీముద్దీన్ (49) స్కోర్ తో రాణించారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ బంగ్లాదేశ్ బౌలర్లపై చెలరేగారు.
సచిన్ టెండూల్కర్ కాస్త నెమ్మదిగా ఆడగా మొదటి బంతి నుంచి బౌండరీలు, సిక్స్ లతో దూసుకెళ్లారు. 35 బంతుల్లో సెహ్వాగ్ 80 పరుగుల స్కోర్ చేయగా మరొక ఎండ్ లో సచిన్ టెండూల్కర్ 33 పరుగులతో సహకారం అందించారు. 10.1 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ జట్టు వికెట్ కోల్పోకుండా 114 పరుగుల స్కోర్ తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20
#21
#22
End of Article