తెలుగు లో సూపర్ హిట్ అయిన ఈ 10 సాంగ్స్ కాపీ కొట్టారని తెలుసా..? ఒరిజినల్ సాంగ్ ఏంటో చూడండి..!

తెలుగు లో సూపర్ హిట్ అయిన ఈ 10 సాంగ్స్ కాపీ కొట్టారని తెలుసా..? ఒరిజినల్ సాంగ్ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

మనకి ఏదైనా సినిమా నచ్చినా, నచ్చకపోయినా పాటలకు మాత్రం మనం ఎక్సెప్షన్ ఇస్తాం. ఎందుకంటే కొన్ని సినిమాలు బాగోకపోయినా పాటలు బాగుంటాయి. కొన్ని పాటలు బాగున్నా సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కారణం ఏదైనా పాటలకి మాత్రం సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాలు కాపీ చేయచ్చు గాని పాటలు కూడా కాపీ సాంగ్స్ ఉంటాయని తెలుసా? అయితే, ఈ లిస్ట్ చూడండి. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పాటలు కాపీ చేసినవే. వాటి ఒరిజినల్ సాంగ్స్ ఏంటో ఈ లిస్ట్ లో చూడండి.

Video Advertisement

1. గుండెల్లో గులాబిలా ముల్లు – రిథమ్ దైవం:

1 gundello gulabi
గుండెల్లో గులాబిలా పాట ‘మల్లేశ్వరి’ సినిమాలోది. ఇందులో దగ్గుబాటి వెంకటేష్ బీచ్ వద్ద రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటను ఒరిజినల్ గా రిథమ్ డివైన్ నుండి ఎన్రిక్ ఇగ్లేసియాస్ రూపొందించారు.

2. 123 కంత్రి -గెట్ బక్

2 kantri

‘జూనియర్ ఎన్ టి రామారావు’ నటించిన ‘కాంతి’ సినిమా టైటిల్ సాంగ్ గెట్ బక్ నుండి కాపీ చేయబడింది, యంగ్ బక్ అతను అమెరికన్ రాపర్ మరియు నటుడు. ఈ పాట చాలా అట్ట్రాక్టీవ్ గా ఉంటుంది.

3. స్వీటీ – అమాండోయి

3 sweety
రేసుగుర్రం సినిమా లో స్వీటీ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇది కూడా కాపీ పాటే. ఇది ఇటాలియన్ గాయకుడు, ఇటాలియన్ ఎక్స్ ఫాక్టర్ విజేత అయిన మాటియో బెకుచి నుండి కాపీ చేయబడింది.

4. చెలియా చెలియా – మరియా మరియా:

4 cheliya cheliya
చెలియా చెలియా అనేది హిట్ చిత్రం ‘ఖుషి’ లోని పాట. ఈ యంగ్ చిత్రం టాలీవుడ్‌లో గొప్ప హిట్ గా నిలిచింది. ఈ పాటను అమెరికన్ మరియు మెక్సికన్ సంగీతకారుడు కార్లోస్ సాంటానా “మరియా మారియా” నుండి కాపీ చేశారు.

5. ఓహ్ ఐ మిస్ యు – ఇన్సోమ్నియాక్:

5 ohh i miss you“ఓహ్ ఐ మిస్ యు” ‘నేనింతే’ చిత్రం నుండి కాపీ చేసిన పాట అని అందరిచేత అంగీకరించబడిందే. ఈ పాట “ఇన్సోమ్నియాక్” నుంచి రీమేక్ అవడం తో ఫాన్స్ వెంటనే గుర్తించారు.

6. భగ భగ మండే – హిట్ యు విత్ ది రియల్ థింగ్

6 bhaga bhaga mande

మున్నా మూవీ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ “భగ భగ మండే” సాంగ్ గుర్తుందా. అప్పట్లో ఈ సినిమా సాంగ్ సూపర్ హిట్ అయింది. కానీ ఇది కూడా కాపీ పాటె. ఈ పాట ట్యూన్ “హిట్ యు విత్ ది రియల్ థింగ్” నుంచి కాపీ చేసారు. 90 ల కాలం లో ఈ పాట బాగా హిట్ అయింది.

7. మాహా మాహా – మై హాంప్స్

7 mantra
మంత్ర సినిమా లో ‘మాహా మాహా ‘ పాట కూడా బాగా హిట్ అయింది. కానీ ఈ పాట ను ప్రపంచ పాప్ బ్రాండ్ సాంగ్ “మై హాంప్స్” నుంచి కాపీ చేసారు.

8. పడితినమ్మో – లీవ్ మీ అలోన్

8 paditinammo
నేను నా రాక్షసి సినిమా లో “పడితినమ్మో” సాంగ్ ఉంది కదా.. ఇది కూడా కాపీ పాటె. మైఖేల్ జాన్సన్ “లీవ్ మీ అలోన్” నుంచి కాపీ చేసారు.

9. డోలు డోలు – రాప్చర్

9 dole doleపోకిరి సినిమా లోని ఈ పాట కూడా కాపీ చేయబడింది. ఇందులో డోలు డోలు పాటను నదియా అలీ “రాప్చర్” నుంచి కాపీ చేసారు. ఒరిజినల్ సాంగ్ 90 ల కాలం లో బాగా పాపులర్ అయింది.

10. గలగలా పారుతున్న గోదారిలా – లిజన్ టు ఫాలింగ్ రైన్

10 gala galaపోకిరి సినిమాలో మరో పాట కూడా కాపీ చేసారు. ఈ సినిమా కి సంగీత దర్శకుడి గా మణిశర్మ పని చేసారు. ఈ పాట జోస్ ఫెలిసియానో “లిజన్ టు ది ఫాలింగ్ రైన్” నుంచి కాపీ చేయబడింది.


End of Article

You may also like