Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక టాపిక్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది. అదే క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి టాపిక్. జస్ప్రీత్ బూమ్రా మార్చి నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకోసం బూమ్రా మ్యాచ్ నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. అయితే, బుమ్రా పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు అని చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది.
Video Advertisement
కొంత మంది ఏమో బుమ్రా పెళ్లి చేసుకునేది సినిమాకి సంబంధించిన వాళ్ళని అని అంటే, మరి కొంతమంది ఏమో కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం బుమ్రా పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు సంజన గణేశన్ అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సంజన స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో టీవీ ప్రెజెంటర్ గా చేస్తారు. అలాగే మిస్ ఇండియా లో కూడా పాల్గొన్నారు.
సంజన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వర్క్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. బూమ్రా, సంజన ఈ మార్చ్ 14వ తేదీన గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా సరే ఈ విషయంపై ఈ ఇద్దరూ స్పందించలేదు. కానీ సంజన అంతకుముందు బూమ్రా గురించి ట్విట్టర్ లో వచ్చిన ట్వీట్స్ కి ఇచ్చిన రిప్లైస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి “మీ సండే జస్ప్రీత్ బుమ్రా కంటే బాగుందా?” అని ఈఎస్పిఎన్ (ESPN) క్రిక్ ఇన్ఫో వాళ్ళు ట్వీట్ చేయగా,
అందుకు సంజన “జస్ ప్రీత్ బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, నా రోజు మూడ్ స్వింగ్స్ ఒకే లాగా ఉంటాయి”. అని రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ క్లాస్ 50 చేసినప్పుడు, క్రికెట్ డాట్ కామ్ వాళ్ళు ఈ విషయాన్ని అప్డేట్ చేస్తూ చేసిన ట్వీట్ కి ఒక ఎమోజీతో సమాధానమిచ్చారు సంజన. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
End of Article