Ads
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రోజు ఇండియాకి ఇంగ్లాండ్ కి మధ్య జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో టీమిండియా ఇన్నింగ్స్ ని కేఎల్ రాహుల్ (1: 4 బంతుల్లో) , శిఖర్ ధావన్ (4: 12 బంతుల్లో) ప్రారంభించారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో) చేయగా, రిషబ్ పంత్ (21: 23 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు. జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు రిషబ్ పంత్ అవుట్ అయ్యారు.
Video Advertisement
తర్వాత హార్దిక్ పాండ్య (19: 21 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి శ్రేయాస్ అయ్యర్ (67: 48 బంతుల్లో 8×4, 1×6) జట్టును ముందుకు నడిపించారు. శ్రేయాస్ అయ్యర్ ఐదవ వికెట్ కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన శార్ధూల్ ఠాకూర్ (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరగగా, చివరి ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ (3 నాటౌట్), అక్షర్ పటేల్ (7 నాటౌట్ ) స్కోర్ చేశారు. దాంతో టీమ్ ఇండియా 124 స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లలో జోప్రా ఆర్చర్ మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ ఒక వికెట్, మార్క్ వుడ్ ఒక వికెట్, క్రిస్ జోర్దాన్ ఒక వికెట్, బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (28: 24 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి జేసన్ రాయ్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. జేసన్ రాయ్ సిక్సర్లతో దూసుకుపోగా, బట్లర్ కూడా దూకుడు పెంచడంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 72 పరుగుల స్కోర్ చేసింది. తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్ (24 నాటౌట్: 20 బంతుల్లో 2×4, 1×6), జానీ బెయిర్‌స్టో (26 నాటౌట్: 17 బంతుల్లో 1×4, 2×6) స్కోర్ తో గెలుపు లాంఛనాన్ని 15.3 ఓవర్లలోనే పూర్తి చేశారు. టీమిండియా బౌలర్లలో చాహల్ ఒక వికెట్, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
End of Article