Ads
నేనో మామూలు అబ్బాయిని.. మంచి జాబ్ తో లైఫ్ లో సెటిల్ అయ్యా. ఇక మా అమ్మా వాళ్ళు కూడా నాకు సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఓ సారి పెళ్లి చూపులకు కూడా తీసుకెళ్లారు. తొలిచూపులోనే ఓ అమ్మాయి ని బాగా ఇష్టపడ్డాను. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా..ఇక కట్నాలు, కానుకలు వంటి వాటితో ఆ అమ్మాయి పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టద్దు అని మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పేశా.. తాను నా జీవితం లోకి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా..
Video Advertisement
పెళ్లిచూపులు పూర్తి అయ్యాయి.. నిశ్చితార్ధం, వివాహ వేడుక కూడా పూర్తయింది. ఈ ఫంక్షన్స్ హడావిడి లో ఆమెతో మాట్లాడడమే కుదరలేదు. తను చాలా సైలెంట్ గా ఉండడం తో ఆమె సిగ్గుపడుతోందేమోనని అనుకున్నాను. కానీ నాతొ మాట్లాడడమే ఇష్టం లేక కాదని అనుకోలేదు. ఫస్ట్ నైట్ సమయం లో మా ఇద్దరికీ మొదటిసారి ఏకాంతం దొరికింది. ఆమె గురించి పూర్తి గా తెలుసుకుని..ఆమెకి ఇష్టమైతేనే ఆమె జీవితంలోకి వెళ్లాలనుకున్నాను. కానీ ఏ మాట మాట్లాడుకోకుండానే తను నిద్రపోయింది.
మూడు రాత్రులు ఇలానే గడిచింది. ఆ తరువాత హనీమూన్ లో కూడా తను ఇలానే తప్పించుకు తిరిగేది. పైకి ముక్తసరిగా మాట్లాడేది. పగలంతా చుట్టూ పక్కల ప్రదేశాలు చూసివచ్చేవాళ్ళం. తన మనసులో ఏమనుకుంటోందో కూడా నాకు తెలిసేది కాదు. ఫోన్ తో ఎక్కువ సేపు సమయం గడిపేది. నాకు దగ్గరవ్వలేక అలా చేస్తోంది అనుకున్నా. కొన్ని రోజులు గడిస్తే.. తనకే నాతొ ఉండడం అలవాటు అవుతుందనుకున్నా.. మేము తిరిగి ఇంటికి వచ్చేసినా తనలో ఏ మార్పు లేదు.. మా అమ్మానాన్న నాకు కొత్త గా పెళ్ళయిందన్న ఉద్దేశం తో తీర్ధ యాత్రల పేరిట వెళ్లిపోయారు. కొన్ని రోజులకు తిరిగి వస్తామని… జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు.
ఇప్పుడైనా.. తనలో మార్పు వస్తుందనుకున్నా. కానీ అదేమిలేదు. తన పని తానూ చేసుకునేది. నాకు వండిపెట్టేది. ఒకే రూమ్ లో ఉండే రెండు వ్యక్తుల్లా ఉంటున్నాము.. మేము భార్యా భర్తలమేనా? అని నాకే అనుమానం వచ్చేస్తోంది. రోజులలా గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి తొందర గా వచ్చేసాను. అయితే తనకి ఈ విషయం చెప్పలేదు. నేను ఇంటికి వచ్చేసరికే, బయట మరొకరి చొప్పులను చూసాను. లోపలకి వెళ్లేసరికి.. తను మరొకరితో సరసాలాడడం చూసి గుండె ఆగినంత పని అయింది.
అనుకోకుండా.. నేను కనపడేసరికి..తను మొదట షాక్ అయి.. అతను నా సోదరుడంటూ నాకు అబద్ధం చెప్పేసింది. నేను మౌనం గా ఉండేసరికి.. కొంతసేపటికి అతను వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను నా భార్యను నిలదీసాను. నాకు తెలియకుండా.. చెప్పకుండా.. ఇలాంటి పనేమిటని అడిగాను. నేను నీ ప్రేమ కోసం ఇంత తాపత్రయపడుతుంటే.. నా వెనుక నన్ను మోసం చేయడానికి మనసెలా వచ్చింది అని అడిగేసరికి.. తను కన్నీళ్ల పర్యంతమైంది. తనకి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. తన తల్లితండ్రులు బలవంతం గా పెళ్ళికి ఒప్పించడం తో చేసేది లేక తలొంచి తాళి కట్టించుకుంది.
పెళ్లి అయినా మనసిచ్చిన వాడిని మర్చిపోలేకపోయింది. నాకు చెప్పలేక నా వెనుక గుట్టుగా ప్రేమ సాగిస్తూ వచ్చింది. అలాంటిది అతనితో నే ఉండిపో అని మొహం మీద చెప్పేశా. తన తల్లితండ్రుల పరువు పోతుందని..అలా చేయలేనని.. మీతోనే ఉంటానని తను చెప్పడం తో అసహ్యమేసింది. అంతలోనే..తన తప్పు ఏమి ఉందిలే అనిపించింది. మరో వైపు.. నాకు జాబ్ లో ప్రమోషన్ వచ్చి ఫారిన్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది.
కానీ.. ఇప్పుడు ఏమి చేయాలో బోధ పడటం లేదు.. ఆమెను తీసుకెళ్లి నా లైఫ్ నేను చూసుకోవాలా? లేక. ఆమె మనసుని అర్ధం చేసుకుని ఆమె జీవితాన్ని చక్కదిద్దాలా..? నేను చేయని తప్పుకి మానసిక క్షోభ అనుభవిస్తున్నా.. నా తల్లితండ్రులకి ఏమి చెప్పాలి..? నా సమస్యకి పరిష్కారమేంటి..?
Note: images used in this article are only for representative purpose. But not the actual characters
End of Article