“సౌందర్య” ఎక్స్‌పోజ్ చేయకపోవడానికి కారణం ఇదే…దాని గురించి ఆమె ఏమన్నారు అంటే.?

“సౌందర్య” ఎక్స్‌పోజ్ చేయకపోవడానికి కారణం ఇదే…దాని గురించి ఆమె ఏమన్నారు అంటే.?

by Anudeep

Ads

అలనాటి సౌందర్య.. సావిత్రి కి ఏమాత్రం తీసిపోరు. ఎక్స్పోజింగ్ తో కాకుండా అభినయం తో ఆకట్టుకున్న నటి ఆమె. చిన్న వయసులోనే వందకు పైగా సినిమాలలో నటించింది. తక్కువ సమయం లోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Video Advertisement

అయితే, దురదృష్టవశాత్తు, ముప్పై ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. విమాన ప్రమాదం లో సౌందర్య మరణించారు. ఆమె మరణించినా.. ఇప్పటికీ, ఆమె సినిమాలను అభిమానించే వారి సంఖ్యా ఎక్కువే ఉంది.

soundarya

నేటికీ ఆమె సినిమా టీవీ లో వస్తోందంటే చూసే వారు చాలా మంది ఉన్నారు. ఆమె ఇప్పటికీ అభిమానుల గుండెల్లో బతికే ఉన్నారనిపిస్తుంది. ఆమె సినిమాలలో నటించే సమయం లో ఆమని తో అత్యంత సన్నిహితం గా మెలిగేవారని చెబుతుంటారు. ఆమని కూడా పలు ఇంటర్వ్యూలలో సౌందర్య గురించి చెబుతూ వచ్చారు. సౌందర్య, ఆమని ఇద్దరు సన్నిహితం గా మెలిగేవారని, అన్ని విషయాలను పంచుకునే వారు అని చెబుతుంటారు.

soundarya 2

ఇటీవల, “చావు కబురు చల్లగా” సినిమా లో నటించిన ఆమని, సినిమా ప్రమోషన్స్ లో భాగం గా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఇందులో ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సౌందర్య చాలా అసలు ఏ సినిమాలోనూ ఎక్స్పోజింగ్ చేయలేదు. కేవలం అభినయం తోనే పదేళ్లు ఇండస్ట్రీ ని ఏలింది. అయితే, ఆమె ఎక్స్ పోజింగ్ చేయకపోవడానికి గల కారణాలను కూడా తన సన్నిహితురాలైన ఆమని తో పంచుకున్నారట.

amani

సౌందర్య కు ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేదని, రేపు పెళ్లయ్యాక తన భర్త ఈ సినిమాలను చూస్తే.. ఎందుకు ఇలా చేసావని అడుగుతాడని ఆలోచించేది అని చెప్పారు. తనతో కూడా ఓ సారి ఈ విషయాన్నే చెప్పిందన్నారు. తనకు ఇలానే ఉండాలి.. ఇలానే ఉంటాను అని కొన్ని ఎథిక్స్ ఉన్నాయని, చివరి వరకు అలానే ఉందని సౌందర్య చెప్పిన విషయాలను ఆమని గుర్తు చేసుకున్నారు. తన సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే విధం గా ఉండాలని కోరుకునేది అని చెప్పుకొచ్చారు. కానీ, చిన్న వయసులోనే తను సంపాదించింది ఏదీ అనుభవించకుండానే వెళ్లిపోయిందని బాధపడ్డారు.

watch video:


End of Article

You may also like