ఇలా ఎవ్వరు ప్రపోజ్ చేసి ఉండరు అనుకుంటా..? ఎట్టకేలకు తన లవ్ స్టోరీ ని బయటపెట్టేసిన మెహరీన్..!

ఇలా ఎవ్వరు ప్రపోజ్ చేసి ఉండరు అనుకుంటా..? ఎట్టకేలకు తన లవ్ స్టోరీ ని బయటపెట్టేసిన మెహరీన్..!

by Anudeep

Ads

“కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అందం మెహరీన్ కౌర్ పిర్జాదా. మెహరీన్ కౌర్ తొందరలోనే భవ్య బిష్ణోయ్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇండస్ట్రీ కి వచ్చిన తక్కువ కాలం లోనే మంచి పేరు తెచ్చుకున్న మెహరీన్ తొందరగానే పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టించేసుకున్నారు. సాధారణం గా కొంచం పాపులారిటీ వస్తే.. తారలు పెళ్ళికి బ్రేక్ వేసేస్తూ ఉంటారు. మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటు ఉంటారు.

Video Advertisement

mehareen

మరోవైపు.. దేని లైఫ్ దానిదే అన్నట్లు.. కొందరు పర్సనల్ లైఫ్ ను కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. మెహరీన్ కౌర్ కూడా ఆ కోవకే చెందుతారు. హఠాత్తుగా, ఈ ముద్దుగుమ్మ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం తో.. ఇది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అన్న సందేహం చాలా మందికే వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే.. భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్ధం కూడా పూర్తి అయిపొయింది. అయితే, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన లవ్ స్టోరీ గురించి ఎట్టకేలకు చెప్పేసింది.

mehareen 1

పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని తాను పెళ్లాడబోతున్నట్లు మెహరీన్ చెప్పేసింది. తనకు కాబోయే భర్త తనను ఎలా ప్రపోజ్ చేసాడో చెప్పేసింది. పరిచయం అయిన ఆరు రోజులకే మెహరీన్ కు కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ ప్రపోజ్ చేశారట. ఎవ్వరు ప్రపోజ్ చేయలేని విధం గా అండమాన్ లో సముద్రం అట్టడుగునకు తీసుకెళ్లి భవ్య బిష్ణోయ్ మెహరీన్ కు ప్రపోజ్ చేశారట. ఆ ప్రపోజల్ నచ్చి తానుకూడా వెంటనే అంగీకారం తెలిపినట్లు మెహరీన్ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like