Ads
పూణే వేదికగా ఇంగ్లాండ్ జట్టుకు టీం ఇండియాకి మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 66 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో రోహిత్ శర్మ (28: 42 బంతుల్లో 4×4)తో కలిసి శిఖర్ ధావన్ (98: 106 బంతుల్లో 11×4, 2×6) భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించారు.
Video Advertisement
జట్టు స్కోర్ 64 వద్ద ఉన్నప్పుడు రోహిత్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (56: 60 బంతుల్లో 6×4)తో శిఖర్ ధావన్ కలిసి రెండో వికెట్ కి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (6: 9 బంతుల్లో 1×4) ఓవర్ వ్యవధిలో అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ (62: 43 బంతుల్లో 4×4, 4×6) చేయగా, హార్దిక్ పాండ్య (1: 9 బంతుల్లో) చేశారు. ఇన్నింగ్స్ చివరిలో కృనాల్ పాండ్య (58 నాటౌట్: 31 బంతుల్లో 7×4, 2×6) స్కోర్ చేశారు. దాంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 317 పరుగుల స్కోర్ చేసింది.
తర్వాత ఇంగ్లాండ్‌కి ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (94: 66 బంతుల్లో 6×4, 7×6), జేసన్ రాయ్ (46: 35 బంతుల్లో 7×4, 1×6) తొలి వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెన్‌స్టోక్స్ (1) చేయగా ఇయాన్ మోర్గాన్ (22), జోస్ బట్లర్ (2) చేశారు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (30), శామ్ కరన్ (12), టామ్ కరన్ (11) ఆదిల్ రషీద్ (0) స్కోర్ చేశారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 42.1 ఓవర్లలో 251 పరుగుల స్కోర్ కి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22#23#24#25#26#27#28#29#30#31 #32#33#34#35#36#37
#38#39#40#41#42#43#44#45#46#47
End of Article