రిలీజ్ కానీ సినిమాకి “జాతీయ అవార్డు” వచ్చింది.. ఆ కథ ఏంటో చూడండి..!

రిలీజ్ కానీ సినిమాకి “జాతీయ అవార్డు” వచ్చింది.. ఆ కథ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

సినిమాల విషయం లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని మనం ఎంత క్యూరియస్ గా ఎదురు చూస్తామో.. అవార్డుల విషయం లో కూడా అంతే. మామూలు అవార్డుల సంగతి పక్కన పెడితే, జాతీయ స్థాయి అవార్డుల విషయం లో మాత్రం కొంత ఆసక్తి ఉండడం సహజం. ప్రతి ఏడాది కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటిస్తూనే వుంది. వీటిలో ఏ హీరో మూవీ కి జాతీయ అవార్డు వస్తుందో అని ఆత్రుత గా ఎదురు చూస్తాం.

Video Advertisement

marakkar 2

కొన్నిసార్లు ఈ అవార్డుల విషయం లో కొంత డిజప్పోయింట్ కూడా అవుతూ ఉంటాం. పలానా హీరో సినిమా అంత బాగా తీసినా దానికి అవార్డు రాలేదనో.. లేదా మరో సినిమా బాగోకపోయిన అవార్డు వచ్చిందనో.. ఇలా రకరకాలుగా కొన్ని రోజుల పాటు చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే, ఈ సారి చర్చ మాత్రం రిలీజ్ కానీ సినిమా గురించి. అవును.. ఒక సినిమా కి రిలీజ్ కి ముందే జాతీయ అవార్డు వచ్చేయడం విడ్డురమే. మళయాలం లో మోహన్ లాల్ నటించిన “మరక్కార్” సినిమా కి జాతీయ అవార్డు వచ్చింది. విశేషమేమిటంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

marakkar 1

ఈ సినిమాను గతేడాది మార్చి 26 న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, కరోనా కారణం గా అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా కిందటి సంవత్సరమే సెన్సార్ ను పూర్తి చేసుకుంది. దీనితో, ఈ సినిమాని గతేడాది సినిమా గానే జ్యురీ లెక్కకట్టింది. అందుకే ఈ సినిమా కి అవార్డు ని ఇచ్చింది. ఈ సినిమాను మే 19 న రిలీజ్ చేయబోతున్నట్లు మోహన్ లాల్ ఇప్పటికే ప్రకటన చేసారు.

marakkar 3

మరో వైపు నాలుగు తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ సినిమా గా “మహర్షి” కి అవార్డు రాగా… ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా “జెర్సీ” సినిమాకు అవార్డు వచ్చింది. “జెర్సీ” సినిమా ఎడిటర్ నవీన్ నూలి కి ఉత్తమ ఎడిటింగ్ అవార్డు లభించింది. అలానే, మహర్షి సినిమా కొరియోగ్రాఫర్ రాజు సుందరం కి కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది.


End of Article

You may also like