Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ నిత్యం యోగాను ప్రాక్టీస్ చేస్తారన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఆయన అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళుతుంటారు. అక్కడ మెడిటేషన్ చేయడం తో పాటు, సాధువులను కలుస్తుంటారు. ఆయన ప్రశాంతత కోసం ఇలా చేస్తూ ఉంటారు. నిత్యం యోగా ను ప్రాక్టీస్ చేస్తూ ఆయన ఓ యోగిలా బతుకుతున్నారు. దేశం లో నిత్యం యోగాను ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.
Video Advertisement
మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా రోజు యోగా చేస్తారు. కానీ, మిగతా వారికి సూపర్ స్టార్ కి కొంత తేడా ఉంది. ఎందుకంటే, మన సూపర్ స్టార్ రజిని కాంత్ కి యోగ చేయడానికి ప్రత్యేకం గా టైం, మాట్ వంటి సాధనాలు ఏమి అవసరం లేదు. ఆయన ఎక్కడవున్నా, ఎలాంటి ఒత్తిడి లో ఉన్నా ప్రశాంతతను పొందగలరు. మీరు ఈ ఫోటోలను గమనిస్తే.. మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది. ఆయన పలు సందర్భాలలో ఇలా చిన్ముద్రతో కనిపిస్తారు.
యోగ లో చిన్ముద్ర కు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనందరికీ తెలిసినదే. ఈ ఫోటోలు గమనిస్తే, అన్నాత్త, షూటింగ్ టైం లోను, దర్బార్ మూవీ ఆడియో లాంచ్ సమయం లోను, అలాగే, ఆయన నివాసం లో మనోబాల ను కలిసిన టైం లో ఆయన తీసుకున్న ఫోటో లో కూడా ఆయన ఇలా చిన్ముద్రతోనే కనిపించారు. కొన్నేళ్లు గా రజిని ప్రాణాయమాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆయన ఎక్కడైనా సరే తన మనసుని అధీనం లోకి తెచ్చుకుని ప్రాణాయామం చేయగలరు. ఇలా చిన్ముద్రతో ప్రాణాయామం చేయడం వలన బాడీ స్టామినా పెరుగుతుంది. ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెరుగుతాయి. వెన్నునొప్పి తగ్గుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ప్రాణాయామానికి అంత ప్రాముఖ్యత ఉంది.
End of Article