Home Sports Adda “ఫస్ట్ మ్యాచ్ దేవుడికి” అంటూ బెంగళూరు తో ముంబై మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

“ఫస్ట్ మ్యాచ్ దేవుడికి” అంటూ బెంగళూరు తో ముంబై మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

క్రికెట్ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 మొదలైంది. మొదటి మ్యాచ్ లోనే మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. మొత్తానికి లాస్ట్ బాల్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించారు. చెన్నై చెపాక్ స్టేడియం లో ఐపీఎల్ – 14 సీజన్ మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు బెంగళూరు జట్టు. తొలి బాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది.

క్రిస్‌ లిన్‌ (49), సూర్యకుమార్‌ (31), ఇషాన్‌ కిషన్‌ (28) రాణించారు. హర్షల్‌ పటేల్‌ పదునైన బౌలింగ్‌ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాక్స్‌వెల్‌ (39), కోహ్లీ (33) రాణించారు. బుమ్రా, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ నిలిచాడు. డివిలియర్స్ కొట్టిన 48 పరుగులు కీలకం.

బెంగళూరు మొదటి మ్యాచ్ గెలవడంతో “ఈ సాలా కప్ నమదే” అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీ నెగ్గడం 2011 తర్వాత ఇదే తొలిసారి. కానీ ముంబై ఇండియన్స్ టీం గురించి అందరికి తెలిసిందేగా. కప్ కొట్టిన ప్రతిసారి మొదటి మ్యాచ్ ఓడిపోయారు. మొదటి మ్యాచ్ ఓడిపోయింది కప్ కొట్టడానికి అంటూ సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

MI fan: meeru enduku odipotunnaro maaku telusu le
MI players: eyy chup re chup….

You may also like