Ads
“వీరభద్ర” సినిమా గుర్తుందా.. ఈ సినిమాలో బాలయ్య బాబు హీరో గా నటించారు. ఈ సినిమా 2005 లో రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ టైం లో చాలా సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఈ సినిమా ఫ్లాప్ అవడం వలన నిర్మాత అంబికా కృష్ణ నష్టపోయారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ టైం లో జరిగిన సంఘటనల గురించి ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
Video Advertisement
రియల్ టాక్ విత్ అంజి అనే ప్రోగ్రాం లో పాల్గొన్న “వీరభద్రం” నిర్మాత అంబికా కృష్ణ ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ సినిమా పాడవ్వడానికి ముఖ్యకారణం ఆ సినిమా డైరెక్టర్ రవి కుమార్ చౌదరి అని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సినిమా ను స్క్రిప్ట్ ప్రకారం చేయలేదని.. ఇష్టం వచ్చినట్లు షూట్ చేసేశారని.. చెప్పిందొకటి..చేసిందొకటి అయ్యిందని చెప్పుకొచ్చారు.
షూటింగ్ ను కూడా సక్రమం గా చేయలేదని.. స్క్రిప్ట్ లో ఒకటి ఉంటె..ఆయన మరొకటి తీసారని మండిపడ్డారు. బాలయ్య లాంటి హీరో డేట్ లు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని.. షూటింగ్ కి కూడా తాగి వచ్చాడని ఆగ్రహం గా చెప్పారు. మరి బాలయ్యగారు ఏమి అనలేదా..? అని ప్రశ్నించగా.. బాలయ్యబాబు గారు కూడా కేకలేశారని.. కానీ ఏమి చేస్తాం..అతని వల్లే సినిమా పాడైంది అని బాధపడ్డారు.
బాలయ్యబాబు గారిని ఏమి అనలేమని, ఆయన ఏ సినిమా కి కమిట్ అయినా.. మధ్యలో జరిగే మార్పుల్ని పట్టించుకోరని.. డైరెక్టర్ ని నమ్మి పని చేస్తారన్నారు. డైరెక్టర్ చెప్పినట్లే చేస్తారన్నారు. షూటింగ్ ఎనిమిది గంటలకు అయితే.. ఆయన ఐదుగంటలకే వచ్చేస్తారని.. ఈరోజుకి ఆయన అదే కమిట్ మెంట్ తో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన పంచుకున్న విషయాలను మీరు ఈ కింద వీడియో లో చూడొచ్చు.
watch video:
End of Article