“పిచ్ లో ఎక్కడ చూసినా ఫీల్డింగ్ జెడ్డు నే” అంటూ RR పై CSK మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!!

“పిచ్ లో ఎక్కడ చూసినా ఫీల్డింగ్ జెడ్డు నే” అంటూ RR పై CSK మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!!

by Mohana Priya

Ads

ముంబయి లోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. డుప్లెసిస్ (33: 17 బంతుల్లో 4×4, 2×6) తో కలిసి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10: 13 బంతుల్లో 1×4) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించారు. నాలుగవ ఓవర్ లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌ లో భారీ షాట్ ఆడబోయి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవ్వగా తర్వాత వచ్చిన మొయిన్ అలీ (26: 20 బంతుల్లో 1×4, 2×6) హిట్టింగ్‌ తో టీం లో ఉత్సాహం నింపారు.

Video Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 78 దగ్గర ఉన్నప్పుడు మొయిన్ అలీ అవుట్ అవ్వగా సురేశ్ రైనా (18: 15 బంతుల్లో 1×4, 1×6), అంబటి రాయుడు (27: 17 బంతుల్లో 3×6) భారీ షాట్లకి ప్రాధాన్యమిస్తూ చేతన్ సకారియా బౌలింగ్ ‌లో ఒకే ఓవర్‌ లో అవుట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కోర్ 125 వద్ద రైనా ఔటవడంతో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ (18: 17 బంతుల్లో 2×4) ఆరంభంలోనే రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చివరి ఓవర్ లో వచ్చిన ఆల్‌ రౌండర్ డ్వేన్ బ్రావో (20 నాటౌట్: 8 బంతుల్లో 2×4, 1×6) కీలకమైన పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 188 పరుగుల స్కోర్ చేసింది.

189 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టుని ఓపెనర్ జోస్ బట్లర్ (49: 35 బంతుల్లో 5×4, 2×6), శివమ్ దూబె (17: 20 బంతుల్లో 2×4) సపోర్ట్ తో ముందుండి నడిపించారు. రాజస్థాన్ విజయానికి 54 బంతుల్లో 102 పరుగులు అవసరమైన దశలో ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా మొదటి బంతికే జోస్ బట్లర్‌ని క్లీన్ బౌల్డ్ చేశారు. బాల్ గమనాన్ని అర్థం చేసుకోలేక పోయిన బట్లర్ బాల్ ని అడ్డుకోలేకపోయారు. దాంతో వెనక్కి వెళ్లిన బాల్ మిడిల్ స్టంప్ కి తగిలింది. అదే ఓవర్ లో చివరి బాల్ కి శివవ్ దూబె ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 143/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like