Ads
వకీల్ సాబ్ పని అయిపోయినట్టే నా ? దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత హిట్ కొట్టి ఫాన్స్ ని ఖుషి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. దాదాపుగా అన్ని థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ కి చేరువలో ఉన్న ఈ చిత్రం.
Video Advertisement
సినిమా కి ఆదిలోనే పెద్ద షాక్ లు ఎదురుకుంది కరోనా సెకండ్ వేవ్ కి తోడు,ఏపీ లో థియేటర్స్ టికెట్ ధర తగ్గించడం , స్పెషల్ షోలు లేకపోవడం వంటి కొన్ని సమస్యలను ఎదురుకుంది.మొదటి వారం బాగానే కలెక్షన్స్ ఉన్నపటికీ అటు తరువాత సోమవారం చాల ఏరియా లో భారీగా పడిపోయాయి.మళ్ళీ ఉగాది అంబెడ్కర్ జయంతి వంటి వరుస సెలవులతో మళ్ళీ కలెక్షన్స్ ఊపందుకోగా రెండవ వారం లో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ లో సినిమా విడుదల అవ్వటం తో ఇప్పటికే చాల మంది ప్రేక్షకులు సినిమా చూసేసారు, సినిమా లేడీ ఓరియెంటెడ్ కావటం తో మాస్ ప్రేక్షకులకి సినిమా ఆకట్టుకోలేక పోవటం, సినిమా ని రిపీటెడ్ ఆడియెన్స్ దూరం అయ్యారు.ఇక ఈ సోమవారం మరీ దారుణంగా బుకింగ్స్ ఉండటం కరోనా విజృంబిస్తు ఉండటం తో సినిమా కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి.ఫుల్ రన్ ఇక దాదాపుగా ముగిసినట్టే అనిపిస్తూ ఉంది.
End of Article