Ads
సాధారణం గా సినిమాలకు భాష ఉండదు . కంటెంట్ బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తూ ఉంటారు. అందుకే డైరెక్టర్లు కూడా ఒక భాషలో హిట్ అయిన మూవీ ని రీమేక్ చేయడమో.. లేక డబ్ చేయడమో చేస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఇతర భాషల్లోంచి తెలుగు లోకి డబ్ చేసిన మూవీస్ ను మనం చాలా నే చూసాం. అలా.. తమిళ్ నుంచి తెలుగు లోకి డబ్ అయిన 8 బెస్ట్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 రోబో:
రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంట గా నటించిన సినిమా రోబో. శంకర్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు నట ఎంత బ్లాక్ బస్టర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఓ సైంటిస్ట్ మనిషి లాంటి ఒక రోబో ను తయారు చేస్తారు. ఈ రోబో జనజీవన స్రవంతి లో కలిసిపోతే మంచి జరుగుతుందా..? చెడు జరిగితే ఎలా ఉంటుంది..? అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ను రూపొందించారు. చిట్టి ద రోబోట్ అంటూ ఈ సినిమలో రజిని నే సైంటిస్ట్ గా, రోబో గా డ్యూయల్ రోల్ చేసారు. రోబో హిట్ కావడం తో.. సీక్వెన్స్ గా రోబో 2.0 ను కూడా రిలీజ్ చేసారు.
#2 D – 16 :
తమిళ్ లో వచ్చిన దురువంగల్ పత్తినారు (D – 16 ) సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కధాంశం. కార్తీక్ నరేన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ లో చేరాలనుకునే ఒక యంగ్ బాయ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతం గా ఈ సినిమా ను మలిచారు.
#3 కాలా:
రజినీకాంత్ యాక్షన్ సినిమా కాలా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కి రంజిత్ దర్శకత్వం వహించారు. కరికాలాన్ అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకం గా పోరాడుతూ ఉంటారు. ధారవి లో ప్రజల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్న విలన్ కు వ్యతిరేకం గా జరిపే పోరాటమే కాలా సినిమా. రజినీకాంత్, నానా పటేకర్ ఈ సినిమా లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు.
#4 చిక్కడు దొరకడు :
తమిళ జిగర్తాండా సినిమా ను తెలుగు లో చిక్కడు దొరకడు గా డబ్ చేసారు. ఈ సినిమా 2016 లో డబ్ చేసారు. అలాగే.. తెలుగులోనే గద్దలకొండ గణేష్ పేరిట రీ మేక్ చేసారు. తమిళ నాట ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది.
#5 వి ఐ పి:
ధనుష్, అమలాపాల్ జంట గా నటించిన సినిమా విఐపి. ఈ సినిమా తెలుగు లో “రఘువరన్ బిటెక్” పేరుతొ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు వేళ్రాజ్ దర్శకత్వం వహించారు. బి టెక్ చదివిన రఘువరన్ ఉద్యోగం దొరక్క నాలుగేళ్లు ఖాళీ గా ఉంటాడు. తనకు సరైన అవకాశం వచ్చాక సొంతం గానే కంపెనీ నడిపే స్థాయికి చేరుకొని సత్తా చాటుతాడు. ఆ తరువాత వచ్చే పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపే సినిమా విఐపి. ఈ సినిమా హిట్ అవ్వడం తో విఐపి 2 పేరిట సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసారు.
#6 చంద్రముఖి:
రజినీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన చంద్రముఖి సినిమాను అంత ఈజీ గా మర్చిపోగలమా.. అప్పట్లో ఈ సినిమా చూసిన పిల్లకాయలకి ప్యాంట్లు తడిసిపోయాయి కూడా. అప్పట్లో ఈ సినిమా డెడికేషన్ అలాంటిది మరి. ఇది కూడా తమిళ సినిమానే. తెలుగు లోకి డబ్ చేసారు. హార్రర్ కి కొంత కామిక్ ఎలెమెంట్స్ ను జోడించి ఈ సినిమా ను రూపొందించారు. ఇప్పటికే హార్రర్ మూవీ అంటే మనలో చాలా మంది మదిలో మెదిలే సినిమా చంద్రముఖి.
End of Article