Ads
సినిమా ఇండస్ట్రీ లో రీమేక్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్. ఆల్రెడీ హిట్ అయిన ఫార్ములా నే.. హిట్ అయిన సినిమా నే మరో భాషలో రీమేక్ చేస్తుండడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. మన టాలీవుడ్ హీరోలలో కూడా చాలా మంది హీరోలు రీమేక్ ల బాట పట్టారు. అయితే.. కొందరు హీరోలు మాత్రం అస్సలు ఒక్క రీమేక్ జోలికి కూడా పోలేదు. రీమేక్ ల జోలికి వేళ్ళని టాలీవుడ్ హీరోలు ఎవరో.. ఈ కింద లిస్ట్ చూడండి.
Video Advertisement
#1 రానా
లీడర్ సినిమా నుంచి.. లేటెస్ట్ గా విరాటపర్వం సినిమా వరకు అన్ని సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలే. ఒక్క బెంగుళూరు డేస్ సినిమాను మాత్రం తమిళ్ లో నటించాడు తప్ప.. ఏ తమిళ సినిమాను తెలుగు లోకి డబ్ చేయలేదు.
#2 విజయ్ దేవరకొండ:
పెళ్లి చూపులు సినిమా నుంచి.. వరల్డ్ ఫేమస్ లవర్ దాకా అన్ని సినిమాలు తెలుగు సినిమాలే. డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుని.. హిట్ అయినా.. ప్లాప్ అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
#3 సాయి ధరమ్ తేజ్:
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అంతే. తన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నా సరే, డైరెక్ట్ తెలుగు మూవీ తోనే హిట్ కొట్టాడు. అంతేకాని ఎదో ఒక మూవీ ని రీమేక్ చేయాలని అనుకోలా..
#4 బన్నీ:
స్టైలిష్ స్టార్ బన్నీ కి కూడా ఒక్క రీమేక్ మూవీ లేదు. ధ్రువ మూవీ వాస్తవానికి బన్నీనే చేయాల్సింది. కానీ.. అది చరణ్ చేతిలోకి వచ్చేసింది.
#5 మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు రీమేక్స్ చేసే ఇంటరెస్ట్ లేదు అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేసాడు. నాని సినిమా కూడా రెండు భాషల్లో రిలీజ్ అయింది. కానీ, అది రీమేక్ మూవీ కాదు.
#6 అఖిల్:
అక్కినేని హీరో అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు. ఒక్కటి కూడా రీమేక్ చేయలేదు.
#7 నితిన్:
కష్టపడి పైకొచ్చిన హీరోల్లో నితిన్ కూడా ఒకరు. ఆయన తన సినిమాలు ప్లాప్ అవుతూ.. కెరీర్ ఎండ్ అయిపొతుందెమో అనే సిట్యుయేషన్ వచ్చినా రీమేక్ ట్రై చేయలేదు.. స్ట్రెయిట్ మూవీస్ తోనే హిట్ కొట్టారు.
#8 శ్రీ విష్ణు:
పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీస్ ను ఎక్కువ గా ఎంచుకునే శ్రీ విష్ణు ఇప్పటివరకు ఒక్క రీమేక్ మూవీ కూడా చేయలేదు.
End of Article