వకీల్ సాబ్ కోసం పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..? పవన్ తో పాటు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారంటే..?

వకీల్ సాబ్ కోసం పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..? పవన్ తో పాటు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారంటే..?

by Anudeep

Ads

పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తరువాత ఆయన “వకీల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాక.. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దాదాపు 90 శాతం రికవర్ అయిపోయాయట.

Video Advertisement

vakil sab 1

సినిమా బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ.. వకీల్ సాబ్ కు కష్టాలు తప్పలేదు. ఏపి లో ఈ సినిమా బెనిఫిట్ షో లు రద్దు అయ్యాయి. ఆ తరువాత ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు తగ్గించాలి అంటూ డిమాండ్ చేసి.. ఈ మేరకు జీవో ను కూడా తెచ్చింది. ఈ క్రమం లో వకీల్ సాబ్ కు కలెక్షన్స్ తగ్గాయి. అయినా.. ఈ సినిమా దూసుకెళ్తున్న తరుణం లో కరోనా కష్టాలు వచ్చాయి.

vakil sab 3

మరో వైపు.. ఈ సినిమా పవన్ కు మంచి పేరు తో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా తెచ్చిపెట్టిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు యాభై కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. సినిమా హిట్ టాక్ వచ్చిన తరువాత ఓ ఏరియా రైట్స్ లో షేర్ కింద 15 కోట్లను కూడా పవన్ తీసుకున్నారని సమాచారం. రీ ఎంట్రీ పవన్ కు లాభదాయకం గానే ఉందని తెలుస్తోంది.

vakil sab 4

పవన్ కళ్యాణ్ కె కాదు ఇతర యాక్టర్లకు కూడా బాగానే ఇచ్చారని తెలుస్తోంది. అంజలి కి, సినిమా లో ఓ పది నిముషాలు కనిపించిన శృతి హాసన్ కి ఇద్దరికీ చెరో యాభై లక్షల పారితోషికం ఇచ్చారట. అనన్య కు మరో పాతిక లక్షలు, నివేదా థామస్ కు 75 లక్షల రూపాయల పారితోషికం గా ఇచ్చారట. హీరో, హీరోయిన్లకే కాదు.. ఈ సినిమాలో మరో లాయర్ గా కనిపించిన ప్రకాష్ రాజ్ కు కూడా కోటి రూపాయల పారితోషికం ఇచ్చారట.

vakil sab 2

వీరికే కాకుండా కెమరామెన్ కు కూడా ఉహించడానికంటే ఎక్కువ పారితోషికం ఇచ్చారని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా భారీ గానే అప్పచెప్పారని తెలుస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ కి కూడా ముందు అనుకున్న మొత్తం కంటే ఎక్కువే ముట్టచెప్పారని సమాచారం.

 


End of Article

You may also like