కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..? ఈ 10 టాలీవుడ్ కమెడియన్ల పారితోషికం ఎంతో చూడండి..!

కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..? ఈ 10 టాలీవుడ్ కమెడియన్ల పారితోషికం ఎంతో చూడండి..!

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీ లో పారితోషకం అనగానే.. ముందు హీరో కి ఎంత..? హీరోయిన్లకు ఎంత అన్న అంశమే చర్చనీయాంశం గా ఉంటుంది. చాల సినిమాల్లో పవర్ ఫుల్ గా ఉండే పాత్రలకు, స్టార్ కామెడియన్లకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఉంటుంది. పాపులారిటీ ని బట్టి రెమ్యునరేషన్ ని కూడా నిర్ణయిస్తారు. కొందరు టాప్ కమెడియన్స్ అయితే.. రోజుకు ఇంత అన్న లెక్కన ఎన్ని రోజులు షూటింగ్ లో ఉండాల్సి వస్తే..అంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. మన టాలీవుడ్ లో కూడా కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

1. పోసాని కృష్ణమురళి

1 posani

రాజా.. లవ్ యు రాజా.. అంటూ తనదైన స్లాంగ్ తో పోసాని కృష్ణ మురళి గారు ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. దీనితో ఆయన కూడా వన్ ఆఫ్ ది టాప్ కమెడియన్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. పోసాని గారి పారితోషికం రోజుకు రెండున్నర లక్షల వరకు ఉంటుంది.

2. ప్రియదర్శి

2 priyadarsi
పెళ్లి చూపులు సినిమా లో హీరో ఫ్రెండ్ గా ఆకట్టుకున్న ప్రియదర్శి స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా ఎదిగారు. ఆ తరువాత తొలిప్రేమ, స్పైడర్, బ్రోచేవారెవరురా, ఎఫ్ 2 , మల్లేశం, రీసెంట్ గా జాతి రత్నాలు.. ఇలా తన టాలెంట్ తో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రియదర్శి కూడా రోజుకు రెండు లక్షల పారితోషికాన్ని తీసుకుంటారట.

3. సునీల్

3 sunil
ఒకప్పుడు కామెడీ రంగానికే కింగ్ గా ఉండేవారు సునీల్.. ఆ తరువాత హీరో గా కూడా ప్రయత్నాలు కొనసాగించారు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ.. పరిపూర్ణ నటుడు అనిపించుకుంటున్నారు. సునీల్ ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట.

4. శ్రీనివాస రెడ్డి

4 srinivasa reddy
తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే శ్రీనివాస రెడ్డి చాలా సినిమాల్లోనే నటించారు. ఆ మధ్య హీరో గా కూడా ట్రై చేసారు. ప్రస్తుతం, శ్రీనివాస రెడ్డి రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట.

5. రాహుల్ రామకృష్ణ

5 rahul ramakrishna
అర్జున్ రెడ్డి లో శివ లాంటి ఫ్రెండ్ ఉండాలని ప్రతి టీనేజ్ అబ్బాయి కోరుకునేంత లా రాహుల్ రామకృష్ణ సినీ అభిమానులకు దగ్గరయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆయన తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. రాహుల్ రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటారట.

6. సప్తగిరి

7 saptagiri
ఈ మగజాతి ఆణిముత్యం గురించి కొత్త గా పరిచయం అక్కర్లేదు. పరుగు సినిమాలో కొంత సీరియస్ క్యారెక్టర్ లో కనిపించినా.. ఆ తరువాత అన్ని కామెడీ రోల్స్ లోనే నటించారు. సప్తగిరి కూడా రోజుకు రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారట.

7. పృథ్వీ రాజ్

6 prudhvi
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా అంటూ నవ్వించడం పృథ్వి రాజ్ కె చెల్లింది. ఖడ్గం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.

8. వెన్నెల కిషోర్

8 vennela kishore
సునీల్ హీరో పాత్రలకు ప్రయత్నిస్తున్న టైం లో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనబడేది.. అప్పుడొచ్చారు వెన్నెల కిషోర్. థియేటర్ లో నవ్వుల వెన్నెల కురిపించి అందరికి దగ్గరయ్యారు. ఆయన ఒక్కో సినిమాకు మూడు లక్షల వరకు తీసుకుంటారు.

9. అలీ

9 ali
కామెడీ చేయడం లో అలీ రూటే సెపరేటు.. సీతాకోక చిలక సినిమా నుంచి అలీ అల్లరి చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. ఎన్నో కష్టాలు పడ్డాక అలీ ఈ రేంజ్ కి చేరుకున్నారు. అలీ ఒక రోజు తీసుకునే పారితోషికం మూడున్నర లక్షల పైనే ఉంటుంది.

10. బ్రహ్మానందం:

10 brahmanandam

కామెడీ అనగానే.. ముందు గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. ఆయన కామెడీ కింగ్. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు మనకు నవ్వొచ్చేస్తుంది. అంతలా కామెడీ పండించగల టాలెంట్ ఆయనది. ఆయన సినిమాలో కనిపించినా చాలు అనుకునే డైరెక్టర్లు కూడా ఉన్నారంటే నమ్మండి. బ్రహ్మానందం అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్.. అంటే రోజుకు ఐదు లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటారట.


End of Article

You may also like